జాతీయ వార్తలు

ముందుగా నాకెందుకు చెప్పలేదు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం, జనవరి 19: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా తనకు తెలియజేయకుండా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయంపై ఒక నివేదిక సమర్పించాలని కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. రాజ్‌భవన్ కార్యాలయం ఈ మేరకు ఒక నివేదిక సమర్పించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ‘సీఏఏకు వ్యతిరేకంగా అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించే అంశాన్ని గవర్నర్‌కు ముందుగా చెప్పకపోవడంపై ఒక నివేదిక సమర్పించవలసిందిగా గవర్నర్ కార్యాలయం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది’ అని రాజ్‌భవన్‌లోని ఉన్నత స్థాయి వర్గాలు ఆదివారం ఒక వార్తాసంస్థకు చెప్పాయి. ఎల్‌డీఎఫ్ నేతృత్వంలోని కేరళ రాష్ట్ర ప్రభుత్వం జనవరి 13వ తేదీన సీఏఏకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ చట్టాన్ని రాజ్యాంగ వ్యతిరేకమయినదిగా ప్రకటించవలసిందిగా అత్యున్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించింది. ఈ విషయంపై గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ ఇప్పటికే కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై తీవ్ర స్థాయిలో దాడి చేశారు. ‘ఒక వ్యక్తి లేదా ఒక రాజకీయ పార్టీ వెర్రి ఆలోచనలకు అనుగుణంగా’ ప్రభుత్వ వ్యవహారాలు, కార్యకలాపాలు నడవజాలవని, ప్రతి ఒక్కరు నియమనిబంధనలను గౌరవించాలని ఆయన ఇటీవల ఢిల్లీలో విలేఖరులతో మాట్లాడుతూ నిశితంగా విమర్శించారు. కొత్త చట్టానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ఆమోదించడంతో పాటు చట్టానికి ఉన్న రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన తొలి రాష్ట్రం కేరళ. ఇదిలా ఉండగా, గవర్నర్ అనవసరంగా రాష్ట్ర ప్రభుత్వ రోజువారీ కార్యకలాపాలలో జోక్యం చేసుకుంటున్నారని అధికార పార్టీ సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి కొడియేరి బాలకృష్ణన్ ఆదివారం ఆరోపించారు. ‘రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్ అప్రతిష్టపాలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడం గవర్నర్ పదవి విధి కాదు’ అని బాలకృష్ణన్ పార్టీ అధికార పత్రిక ‘దేశాభిమాని’లో రాసిన ఒక వ్యాసంలో హితవు పలికారు.