జాతీయ వార్తలు

నిర్దోషులం.. ‘నార్కో’కు సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* కోర్టుకు స్పష్టం చేసిన కతువా నిందితులు
కథువా, ఏప్రిల్ 16: ఎనిమిదేళ్ల మైనర్‌పై జరిగిన గ్యాంగ్‌రేప్, హత్య కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ ఘటనలతో తమకు ఎలాంటి సంబధం లేదని, తాము నిర్దోషులం అంటూ నిందితులు తెలిపారు. సోమవారం జిల్లా, సెషన్స్ న్యాయమూర్తి సంజయ్ గుప్తా ఎదుట ఏడుగురు నిందితులను హాజరుపరిచారు. తాము నిర్దోషులమని, నార్కో పరీక్షలకు సిద్ధమని నిందితులు కోర్టుకు తెలిపారు. దేశవ్యాప్తంగా తీవ్ర సంచలన రేపిన ఈ కేసులో ఎనిమిది మందిపై అభియోగాలు నమోదు చేశారు. నిందితుల్లో ఒకడు మైనర్ కావడంత మిగతా ఏడుగుర్ని కోర్టులో హాజరుపరిచారు. నిందితులకు చార్జిషీట్ కాపీలు ఇవ్వాలని రాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ విభాగాన్ని ఆదేశించిన న్యాయమూర్తి కేసును ఈ నెల 28కి వాయిదా వేశారు. మైనారిటీ సంచార తెగకు చెందిన ఎనిమిదేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసిన కామాంధులు లైంగిక దాడికి పాల్పడి హత్య చేశారు. జనవరిలో ఈ ఘాతుకం చోటుచేసుకుంది. బాలిక కిడ్నాప్, రేప్, హత్యా నేరాల కింద క్రైమ్‌బ్రాంచ్ పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. మైనర్ నిందితుడిపై ప్రత్యేకంగా మరో చార్జిషీట్ దాఖలయింది. చీఫ్ జుడీషియల్ మెజిస్ట్రేట్‌కు ఈనెల 9న సమర్పించిన చార్జిషీట్ కాపీని తమకు అందజేయాలని నిందితుల తరఫున్యాయవాది సంజయ్‌గుప్తాను అభ్యర్థించారు. సోమవారం సెషన్స్‌కోర్టులో కేసు విచారణ ప్రారంభం కాగానే నిందితులు ఏడుగురినీ భారీ భద్రత మధ్య కోర్టు వెనుక నుంచి తీసుకొచ్చారు. బాలికపై పలుమార్లు అత్యాచారం చేసినట్టు తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రత్యేక పోలీసు అధికారి దీపక్ ఖజురియా పోలీసు వ్యాన్ నుంచే మీడియాతో మాట్లాడాడు. ‘నార్కో పరీక్షలు జరపాలి. అలాగే సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నా’అంటూ పేర్కొన్నాడు.
కోర్టు హాలులో విచారణ జరుగుతుండగా ప్రధాన నిందితుడు సాంజీరామ్ కుమార్తె మధు శర్మ బయట ఆందోళనకు దిగింది. కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని ఆమె డిమాండ్ చేసింది. బాధితురాలు కిడ్నాప్‌కు గురైన గుడిలో సాంజీరామ్ కేర్‌టేకర్. ఈ ఘోరానికి ప్రధాన కుట్రదారుడు అతనేనని ఆరోపణ. నిందితులకు పూర్తి సహాయ, సహకారాలు సాంజీనే అందించాడు. దీపక్ ఖజురియా, సురేందర్ వర్మ, ప్రవీణ్‌కుమార్ అలియాస్ మన్నూ, రామ్ మేనల్లుడు, జువెనైల్, విశాల్ జనగోత్రా అలియాస్ శమ్మాలతో కేర్‌టేకర్ చేతులు కలిపాడని పోలీసులు వెల్లడించారు. కాగా చార్జిషీట్‌లో విచారణ అధికారులైన ఎస్సై ఆనంద్ దత్తా, హెచ్‌సీ తిలక్ రాజ్ పేర్లూ చేర్చారు. సాక్షాలు ధ్వంసం చేయడానికి 4 లక్షల రూపాలు తీసుకున్నట్టువారిపై ఆరోపణలు.