జాతీయ వార్తలు

సంక్షోభాల మధ్య విదేశీ యాత్రలా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్: విశ్వహిందూ పరిషత్‌కు ఇటీవల స్వస్తి పలికిన ప్రవీణ్ తొగాడియా ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని తీవ్ర స్వరంతో విమర్శలు గుప్పించారు. హిందూత్వ ఆశయం కోసం మంగళవారం నుంచి నిరవధిక నిరసన దీక్షను చేపట్టనున్న ఆయన, ప్రధాని మోదీ తాజాగా చేపట్టిన విదేశీ పర్యటనపైనే ధ్వజమెత్తారు. ఒకపక్క దేశంలో మహిళలకు ఏమాత్రం భద్రతలేని పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో ప్రధాని ఈ విదేశీ పర్యటన చేపట్టడం ఏమిటంటూ ఆయన ప్రశ్నించారు. సరిహద్దుల్లో సైనికులకు భద్రత లేదని, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, మహిళలకు ఇళ్లలోనే రక్షణ కొరవడిందంటూ తొగాడియా తనదైన శైలిలో మోదీ ప్రభుత్వ తీరుపై నిరసన గళాన్ని వ్యక్తం చేశారు. ఇంత సంకుచిత పరిస్థితులు దేశంలో నెలకొన్న తరుణంలో మోదీ ఐదు రోజులు విదేశీ పర్యటన చేపట్టడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. రేపటినుంచి తొగాడియా చేపట్టనున్న నిరవధిక నిరాహార దీక్షకు మద్దతు పెరుగుతోంది. విహెచ్‌పి కార్యకర్తలే 5వేల మందికి పైగా ఇప్పటికే ఆయనకు మద్దతు ప్రకటించారు. మొత్తం గుజరాత్ విహెచ్‌పి విభాగం అంతా తొగాడియా కోసం పని చేస్తోందని ఆ సంస్థ ప్రతినిధి జే షా అన్నారు. మోదీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను గుర్తు చేయడానికే తొగాడియా రేపటినుంచి నిరాహార దీక్ష చేపడుతున్నారని షా పేర్కొన్నారు. అయోధ్యలో రామాలయాన్ని నిర్మించాలని, పార్టీ ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నట్టుగా 370 రాజ్యాంగ అధికరణను రద్దు చేయాలన్న విషయాన్ని మోదీ సర్కారుకు గుర్తు చేయాలన్నదే ఈ నిరవధిక దీక్ష లక్ష్యమన్నారు.