జాతీయ వార్తలు

ఎన్‌పీఆర్ ఐచ్ఛికమే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 21: జాతీయ పౌర రిజిష్టరు (ఎన్‌పీఆర్) సమాచారం ఇవ్వటం ఐచ్చికమే తప్ప తప్పనిసరి కాదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ఎన్‌పీఆర్‌ను అమలు చేసే ప్రసక్తే లేదంటూ బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టంగా ప్రకటించిన నేపథ్యంలో మంత్రి కిషన్ రెడ్డి ఈ ప్రకటన చేయటం ప్రాధాన్యతను సంతరించుకున్నది. కిషన్ రెడ్డి మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ ఎన్‌పీఆర్ ప్రక్రియను యుపీఏ ప్రభుత్వం ప్రారంభించింది తప్ప తమ ప్రభుత్వం కాదని స్పష్టం చేశారు. ఎన్‌పీఆర్ రాజ్యాంగబద్ధమైన బాధ్యత కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు దీనిని వ్యతిరేకించకూడదని కిషన్ రెడ్డి తెలిపారు. ఎన్‌పీఆర్ ప్రక్రియను పూర్తి చేయడం రాష్ట్ర ప్రభుత్వాల రాజ్యాంగబద్ధమైన బాధ్యత, దీని నుండి తప్పుకునేందుకు వీలు లేదని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన ఎన్‌పీఆర్‌ను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రీ-నోటిఫై చేశాయి, ఇంత జరిగిన అనంతరం తాము దీనిని అమలు చేయమంటూ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన అన్నారు. జనాభా లెక్కల సేకరణతోపాటు పూర్తి చేయాల్సిన ఎన్‌పీఆర్ గురించి కేంద్రం ఎప్పటికప్పుడు రాష్ట్ర ఫ్రభుత్వాలకు సమాచారం అందజేస్తూనే ఉంటుందన్నారు. జనాభా లెక్కల సేకరణ, ఎన్‌పీఆర్ ప్రక్రియ 2020 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ 30, 2020 వరకు సాగుతుందన్నారు. తెలంగాణా ప్రభుత్వం 2014లో జరిపిన సమగ్ర కుటుంబ సర్వే కార్యక్రమంలో తెలంగాణ ప్రజల నుండి లోతైన సమాచారం సేకరించింది, బ్యాంకు ఖాతాల వివరాలు, ఆరోగ్య వివరాలు అడిగినా ఎవరూ ప్రశ్నించలేదు కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సమగ్ర పథకాల కోసం సమగ్ర సమాచారాన్ని కోరితే తప్పుపడుతున్నారని కిషన్ రెడ్డి బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలను విమర్శించారు.
మజ్లిస్ అధ్యక్షుడు, లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ తెలంగాణ ప్రభుత్వం జరిపిన సమగ్ర కుటుంబ సర్వేను ఎందుకు ప్రశ్నించలేదని ఆయన నిలదీశారు. ప్రతిపక్షాలు రాజకీయ దురుద్దేశ్యంతోనే ఎన్‌పీఆర్‌ను వ్యతిరేకిస్తున్నాయని ఆయన ఆరోపించారు.