రాష్ట్రీయం

‘కింగ్‌మేకర్’పైనే దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, ఏప్రిల్ 16: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల తేదీ సమీపించేకొద్దీ అధికారం నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ మళ్లీ పీఠం ఎక్కాలన్న బీజేపీ వ్యూహ ప్రతివ్యూహాలు మరింత పదునెక్కుతున్నాయి. తాజాగా జరిగిన సర్వేలో ఏ పార్టీకి మెజార్టీ రాదన్న సంకేతాలు వెలువడటంతో అధికారంలోవున్న కాంగ్రెస్ మరింతగా అప్రమత్తమైంది. బీజేపీ సైతం తనదైన శైలిలో మిత్రపక్షాల వేటలో పడింది. ఎన్నికల అనంతర స్థితిలో జేడీఎస్ కింగ్‌మేకర్‌గా అవతరించే అవకాశం ఉండటంతో ఆ పార్టీని మచ్చిక చేసుకునే దిశగా కాంగ్రెస్, బీజేపీలు ఆచితూచి అడుగులేస్తున్నాయి. ఏ పార్టీకీ మెజారిటీ రాని పరిస్థితుల్లో పగ్గాలు చేపట్టాలంటే జెడీఎస్ మద్దతే కీలకం అవుతుంది కనుక దానికి అనుగుణంగానే పావులు కదుపుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీలకు మెజార్టీలేని పరిస్థితుల్లో దేవెగౌడ సారథ్యంలోని జేడీఎస్‌దే కీలక పాత్ర అవుతుందన్న సంకేతాల నేపథ్యంలో ఆ పార్టీతో పొత్తుకు సంబంధించి కాంగ్రెస్ నాయకత్వం ఆచితూచి అడుగులేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల అనంతర పరిస్థితుల్లో బలమైన మిత్రుల చేయూత కావాలంటే గౌడ నాయకత్వాన్ని విమర్శించడం మానుకోవాలంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి జెడీ (సెక్యులర్) నాయకులు విజ్ఞప్తి చేశారు. తమ పార్టీ కర్నాటకకే పరిమితమైనప్పటికీ తమకంటూ బలమైన ఓటు బ్యాంకు ఉందని జెడీ(ఎస్) నాయకుడు దేవెగౌడ స్పష్టం చేయడంతో దాంతో ఎన్నికల అనంతర పొత్తుపై కాంగ్రెస్ ఇప్పటినుంచే దృష్టి సారించింది. ముఖ్యంగా జేడీ(ఎస్)కు తమ మద్దతు ఉంటుందని మజ్లిస్ నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ చెప్పడంతో రాష్ట్ర రాజకీయాలు కొత్త మలుపు తిరిగాయి. తమకు కర్నాటకలో కూడా మంచి పట్టుందని, రానున్న ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టకుండా జెడీ(ఎస్) నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామికి మద్దతుగా ప్రచారం చేస్తామని ఓవైసీ తెలిపారు. ఏ పార్టీకి మెజారిటీ రాని పరిస్థితుల్లో ముందస్తు పొత్తులకంటే అనంతర పొత్తులకే ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి అటు కాంగ్రెస్, బీజేపీలు తానొవ్వక, నొప్పింపక అన్న రీతిలోనే జెడీ (ఎస్) పట్ల వ్యవహరించే పరిస్థితి ఉంది.