జాతీయ వార్తలు

మీ సవాల్‌ను స్వీకరిస్తున్నా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 22: పౌరసత్వ సవరణ చట్టంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నానని బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి ప్రకటించారు. పౌరసత్వ సవరణ చట్టంపై తనతో బహిరంగ చర్చకు ప్రతిపక్షం సిద్ధమేనా? అని అమిత్ షా ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో జరిగిన ఒక ర్యాలీలో సవాల్ చేయడం తెలిసిందే. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ పేర్లను అమిత్ షా ప్రస్తావిస్తూ చర్చకు రావాల్సిందిగా సవాల్ విసిరారు. అమిత్ షా చేసిన ఈ సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు మాయావతి బుధవారం ట్వీట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న పౌరసత్వ సవరణ చట్టం, అమలు చేయాలనుకుంటున్న ఎన్‌పీఆర్, ఎన్‌ఆర్‌సీలకు వ్యతిరేకంగా దేశమంతా ఉద్యమాలు కొనసాగుతున్నాయి, ముఖ్యంగా యువకులు, విద్యార్థులు ఉద్యమించటంతో ఎన్డీఏ ప్రభుత్వం భయపడిందని మాయావతి చెప్పారు.
ఈ నేపథ్యంలో పౌరసత్వ సవరణ చట్టం, ఎన్‌పీఆర్, ఎన్‌ఆర్‌సీలపై అమిత్ షాతో ఎక్కడైనా, ఎప్పుడైనా బహిరంగ చర్చకు తమ పార్టీ సిద్ధమేనని మాయావతి ట్వీట్ చేయటం గమనార్హం. ఇదిలాఉండగా అమిత్ షా సవాల్‌కు రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ నుండి ఇంత వరకు ఎలాంటి స్పందన రాలేదు.
'చిత్రం... బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి