జాతీయ వార్తలు

బీజేపీతో కలిసి ప్రయాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 22: ఆంధ్ర ప్రదేశ్‌లో తెలుగు దేశం స్థానాన్ని ఆక్రమించుకుని అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించేందుకు బీజేపీ-జనసేన కూటమి ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించాయి. రాష్ట్రంలో బీజేపీ, జనసేన కూటమి అనుసరించాల్సిన కార్యచరణ పథకాన్ని సిద్ధం చేసుకున్నారు. ఇరుపక్షాల నాయకులు గురువారం ఉదయం 9 గంటలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డాను కలిసి రెండు పార్టీల కార్యచరణ పథకం
గురించి వివరిస్తారు. ఫిబ్రవరి 2న తాడేపల్లి నుంచి విజయవాడ వరకు లాంగ్ మార్చ్ నిర్వహించటం ద్వారా రెండు పార్టీల కూటమి తమ కార్యాచరణ అమలుకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించింది. బీజేపీ, జనసేన కలిసి పని చేస్తాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. బీజేపీలో జనసేనను విలీనం చేయటం లేదని ఆయన స్పష్టం చేశారు. జనసేనను బీజేపీలో విలీనం చేస్తామనే అపొహ ఎవ్వరికీ ఉండాల్సిన అవసరం లేదని పవన్ స్పష్టమైన ప్రకటన చేశారు. బీజేపీ, జనసేన నాయకులు బుధవారం రాత్రి విలేకరుల సమావేశంలో ఈ విషయాలు ప్రకటించారు. ఢిల్లీలో బుధవారం జరిగిన బీజేపీ, జనసేన సమన్వయ కమిటీ సమావేశంలో రాష్ట్ర రాజకీయ పరిస్థితుల గురించి చర్చించిన అనంతరం ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు కన్నా లక్ష్మీనారాయణ, నాదెండ్ల మనోహర్ విలేకరులతో చెప్పారు. ఇదిలాఉండగా పవన్, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, రాజ్యసన సభ్యుడు జీవీఎల్ నరసింహారావు, సీనియర్ నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ దేవధర్, జనసేన నాయకులు అవిభాజిత రాష్ట్ర శాసనసభ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ మరి కొందరు నాయకులు బుధవారం ఢిల్లీలో పలు దఫాలుగా మంతనాలు జరిపారు. బీజేపీ, జనసేన నాయకులు బుధవారం మధ్యాహ్నం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో దాదాపు 3 గంటల పాటు మంతనాలు జరిపారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఇంత వరకు చేసిన ఆర్థిక సహాయం, నిధుల కేటాయింపు, వాటి ఖర్చు తీరు తెన్నుల గురించి నిర్మలా సీతారామన్‌తో వారు చర్చించి వివరాలు సేకరించుకున్నట్లు తెలిసింది. అమరావతిలో రాజధాని నిర్మాణానికి కేంద్రం ఇంత వరకు అందజేసిన నిధుల వివరాలు కూడా వారు ఆడిగి తెలుసుకున్నారని అంటున్నారు. ఇరు పక్షాల నాయకులు ఆ తరువాత నరసింహారావు నివాసంలో మరో గంట పాటు రెండు పార్టీల సమన్వయ కమిటీ చర్చలు జరిగాయి. బీజేపీ, జనసేన కూటమి సమన్వయ సంఘం సభ్యులు ప్రతి 15 రోజులకు ఒకసారి సమావేశమై కార్యాచరణ పథకం అమలును సమీక్షిస్తారని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. ఇకమీదట రాష్ట్రంరో ఏ కార్యక్రమం చేపట్టినా రెండు పార్టీలు కలిసి కట్టుగా చేపడతాయన్నారు. రాజధాని విషయంలో రైతులు, ప్రజలకు అండగా ఉంటామని, వారికి సంఘీభావం తెలుపుతామని జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ తెలిపారు. వచ్చే నెల 2న మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి నుండి విజయవాడ వరకు కవాతు జరపాలని నిర్ణయించామని ఆయన వెల్లడించారు. కలిసి పోరాడుతాము, స్వలాభాలను పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసం పోరాడుతామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్వలాభం కోసం పని చేస్తోంది తప్ప రాష్ట్ర ప్రజల ప్రయోజనాల పరిరక్షణ కోసం కాదనేది తమకు అర్థమైందన్నారు. ప్రజల పక్షాన నిలబడతాము, ప్రజల కోసం పోరాడుతామని ఆయన ప్రకటించారు. రాజధాని విషయంలో రైతుల పక్షాన పోరాడుతామని రెండు పార్టీల నాయకులు హామీ ఇచ్చారు. సమన్వయ కమిటీలో రెండు పార్టీల వారు ఎవరుంటారనేది రేపు ప్రకటిస్తామని నరసింహారావు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతి ఉండాల్సిందేనని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. రాజధానిని ఆమరావతి నుంచి మార్చే అంశంపై కేంద్రం ఎలాంటి జోక్యం చేసుకోదు కానీ రాష్ట్ర బీజేపీ, జనసేన కూటమి అమరావతి కోసం పోరాడుతాయని ఇరు పక్షాల నాయకులు తెలిపారు. కేంద్రం గతంలో తెలుగుదేశం ప్రభుత్వానికి అందజేసిన సహాయ, సహకారాలను ప్రస్తుత ప్రభుత్వానికి కూడా అందజేస్తుందని ఇరుపక్షాల నాయకులు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ అందజేసిన నిధుల ఉపయోగానికి సంబంధించిన యుటిలైజేషన్ సర్ట్ఫికేట్లను తెలుగుదేశం ప్రభుత్వం ఇవ్వనట్లే ప్రస్తుతం అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులకు సంబంధించిన వినియోగ సర్ట్ఫికేట్లను అందజేయటం లేదని పవన్ కల్యాణ్, దగ్గుబాటి పురంధేశ్వరి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని కలిసిన అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ ఆరోపించారు. అమరావతి ఏపీకి శాశ్వత రాజధానిగా ఉంటుందని రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజలు, రైతులకు హామీ ఇస్తున్నామని వారు తెలిపారు. అమరావతిని రాజధానిగా కొనసాగించేందుకు అత్యంత పటిష్టమైన కార్యచరణ పథకాన్ని త్వరలోనే ప్రకటిస్తామని వారు తెలిపారు. పరిపాలనా రాజధాని విశాఖపట్నంలో గణతంత్ర దినోత్సవ పరేడ్ నిర్వహిస్తామని ముందు ప్రకటించి ఇప్పుడు దానిని మళ్లీ విజయవాడకు మార్చారు, దీనికే ఇన్ని ఇబ్బందులు పడుతుంటే ఇక రాజధానిని అక్కడికి తరలించటం సాధ్యమా అని వారు ప్రశ్నించారు. కేంద్రంతో చర్చించి రాజధానిని మరుస్తామని వైకాపా ప్రభుత్వం చెబుతోంది, మూడు రాజధానుల ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం సమ్మతి లేదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. మూడు రాజధానులను ఏర్పాటు చేయాలన్నది వైకాపా ప్రభుత్వం స్వంత నిర్ణయమని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తీరు మారకపోతే సమస్యలు ఎదురవుతాయంటూ నిర్దిష్ట ప్రణాళికతో పాలన సాగించగలిగితేనే మంచి ఫలితాలు ఉంటాయన్నారు. రైతులు, మహిళల పట్ల విచక్షణ లేకుండా వ్యవహరించడం మంచిది కాదని ఆయన స్పష్టం చేశారు.