జాతీయ వార్తలు

చంద్రయాన్-3 మిషన్‌కు శ్రీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, జనవరి 22 : భారత అంతరిక్ష కేంద్రం (ఇస్రో) నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుండి చంద్రయాన్-3 మిషన్ పనులకు శ్రీకారం చుట్టినట్లు బెంగళూరులో బుధవారం ఇస్రో చైర్మన్ డాక్టర్ కె. శివన్ వెల్లడించారు. చంద్రమండలానికి మానవ మిషన్‌ను ఇస్రో చేపట్టే ప్రయత్నాలపై ఆయన స్పందిస్తూ ఇప్పటికిప్పుడే సాధ్యం కాకున్నా త్వరలోనే ఇది సాకారం అవుతుందన్నారు. ఇక చంద్రయాన్-3 లాండర్, క్రాఫ్ట్ ఖర్చు దాదాపు 250కోట్లరూపాయలు కాగా లాంచింగ్‌కు 350 కోట్ల రూపాయలు వ్యయమవుతుందని శివన్ పేర్కొన్నారు. చంద్రయాన్-2లో మాదిరిగానే చంద్రయాన్-3 లోనూ లాండర్, రోవర్, ప్రొపలేషన్ మాడ్యూల్స్ వుంటాయని అన్నారు. చంద్రయాన్-2లో ఆర్బిటార్ మిషన్ జీవితకాలం ఏడేళ్లని చంద్రయాన్-3లోనూ దీనిని ఉపయోగిస్తామన్నారు. మరోవైపు గగన్‌యాన్ మిషన్‌కు సంబంధించి ఎంపిక చేసిన నలుగురు వ్యోమగాములు ఈ మాసాంతానికి శిక్షణ నిమిత్తం రష్యా వెళతారని తెలిపారు. 1984లో రాకేష్ శర్మ రష్యన్ మాడ్యుల్‌లో అంతరిక్షంలోకి వెళ్ళగా ఈ సారి భారత వ్యోమగాములు దేశీ మాడ్యూల్‌లోనే బారత్ నుండి వెళతారని ఆనందాన్ని వ్యక్తం చేశారు.

'చిత్రం... బెంగుళూరులో విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతున్న ఇస్రో ఛైర్మన్ డాక్టర్ కె. శివన్