జాతీయ వార్తలు

ఆమోదం.. అంతేసంగతి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: వైఎస్‌ఆర్‌సీపీ లోక్‌సభ సభ్యులు తమ సభ్యత్వాలకు చేసిన రాజీనామాలను ఆమోదించే సూచనలు కనిపించటం లేదు. ఐదుగురు లోక్‌సభ సభ్యులు చేసిన రాజీనామాలకు సంబంధించిన ఫైలు ఇంతవరకూ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదానికే వెళ్లలేదు. వైకాపా లోక్‌సభ సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్, మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి ఈ నెల 6న తమ సభ్యత్వాలకు రాజీనామా చేయటం తెలిసిందే. వైకాపా ఎంపీలు స్పీకర్ ఫార్మాట్‌లోనే తమ రాజీనామాలను సమర్పించినా సుమిత్రా మహాజన్ ఆ తరువాత ఐదుగురు ఎంపీలను పిలిపించుకుని వారితో మాట్లాడారు. ఏదైనా ఒత్తిడిలో రాజీనామా చేశారా అంటూ ఎంపీలను అడగటం, అలాంటిదేమీ లేదని వారు స్పష్టంగా చెప్పటం తెలిసిందే. వైకాపా ఎంపీలు తమ లోక్‌సభ సభ్యత్వాలకు రాజీనామా చేసి పదిరోజులు కావస్తున్నా వాటిని ఆమోదించే అంశంపై ఎలాంటి ప్రక్రియ ప్రారంభం కాలేదు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై ఎలాంటి హామీ ఇవ్వకపోవటం, ఎన్‌డీఏ ప్రభుత్వంపై తామిచ్చిన అవిశ్వాస తీర్మానం చర్చకు రానందుకు నిరసనగా వైకాపా ఎంపీలు పార్లమెంటు బడ్జెట్ సమావేశాల ఆఖరు రోజు తమ రాజీనామాలను స్పీకర్‌కు పంపించటం తెలిసిందే. ప్రత్యేక హోదా ఇవ్వనందుకు నిరసనగా వైకాపా ఎంపీలు రాజీనామా చేశారనే అంశం స్పీకర్ సుమిత్రా మహాజన్ దృష్టికి వెళ్లిందని చెబుతున్నారు. ఎంపీల రాజీనామాను ఫైల్‌ను సెక్రటరీ జనరల్ కార్యాలయం సిద్ధం చేస్తే తప్ప అది సుమిత్రా మహాజన్ పరిశీలనకు రాదు. సుమిత్రా మహాజన్ ఆమోదం తెలిపితేగాని ఐదు లోక్‌సభ నియోజకవర్గాలు ఖాళీగా ఉన్న విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫై చేసేందుకు వీలుండదు. సుమిత్రా మహాజన్ ఐదుగురు వైకాపా ఎంపీల రాజీనామాలను ఆమోదించి దీనిని కేంద్ర ఎన్నికల సంఘానికి అధికారికంగా తెలియజేయవలసి ఉంటుంది. లోక్‌సభ సెక్రటరీ జనరల్ కార్యాలయం నుండి లేఖ అందిన తరువాతనే కేంద్ర ఎన్నికల సంఘం ఈ నియోజకవర్గాలు ఖాళీ అయినట్లు నోటిఫై చేసి ఉపఎన్నికలు నిర్వహించే అంశంపై ఒక నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. లోక్‌సభ ఎన్నికలు మరో ఏడాదిలో అంటే 2019 ఏప్రిల్, మేలో జరుగవలసి ఉన్నది. తదుపరి లోక్‌సభ ఎన్నికలకు గడువు కేవలం ఒక ఏడాది మాత్రమే ఉన్నందున కేంద్ర ఎన్నికల సంఘం వైకాపా ఖాళీ చేసిన ఐదు నియోజకవర్గాలకు ఉపఎన్నికలు నిర్వహిస్తుందా? అనేది చర్చనీయాంశంగా మారింది.
మామూలుగా అయితే ఆరు లేదా అంతకంటే ఎక్కువ నెలల సమయం ఉండే పక్షంలోనే ఉపఎన్నికలు నిర్వహిస్తారు. రాజీనామాలను ఆమోదించటంలో సుమిత్రా మహాజన్ ఏమాత్రం అలస్యం చేసినా ఉపఎన్నికలు జరగటం దాదాపుగా కష్టమని అంటున్నారు.