బిజినెస్

‘మరిన్ని పన్ను రాయితీలు కల్పించండి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 25: బీమా పరిశ్రమ మరింతగా ప్రజల్లోకి చొచ్చుకుని వెళ్లి విస్తరించేందుకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం మరిన్ని పన్ను రాయితీలు కల్పిస్తుందని ఆ పరిశ్రమ యాజమాన్యాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ప్రధానంగా జీవిత, సాధారణ కవరేజికి సంబంధించిన పాలసీలను అధిక స్థాయిలో సేకరించాలన్న లక్ష్యం నెరవేరాలంటే ప్రభుత్వ చేయూత అవసరమని జీవిత బీమా మండలి విజ్ఞప్తి చేసింది. ఈమేరకు రానున్న బడ్జెట్ ప్రయోజనాల కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నామని, వ్యక్తిగత పాలసీలకు సంబంధించిన ప్రీమియంలపై పెంచిన వ్యక్తిగత పన్నుల శాతాన్ని తగ్గించాలని జీవిత బీమా మండలి జాతీయ కార్యదర్శి ఎస్‌ఎన్ భట్టాచార్య విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఈ పన్ను పరిమితి రూ. 1.5 లక్షల వరకు ఉందని, దీన్ని రూ. 3 లక్షలకు పెంచాలని కోరారు. స్వల్పకాలిక, దీర్ఘకాలిక పెట్టుబడులు ఈ రంగంలో పెరగాలంటే ఇలాంటి సరళతర విధానాలు అవసరమని తెలిపారు. కాగా తొలిసారి జీవిత బీమా తీసుకునే వారికి చెల్లించాల్సిన ప్రీమియంలో రూ. 50,000 వరకు తగ్గింపు సదుపాయాన్ని కల్పిస్తే ప్రోత్సాహకరంగా ఉంటుందని ఆదిత్య బిర్లా లైఫ్ ఇన్సూరెన్స్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ కమలేష్ రావు అభిప్రాయపడ్డారు. అలాగే టర్మ్ ప్లాన్లకు సంబంధించి పూర్తి రక్షణతో కూడిన పాలసీలు కొనుగోలు చేసే వారికి అదనంగా మరో రూ. 50వేలు ప్రయోజనం చేకూరేలా చూడాలని సూచించారు. అలాగే వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) రేటును సైతం 12 శాతానికి తగ్గించాలని ఇన్‌పుట్ పన్ను ప్రయోజనాలను సైతం కల్పించాలని కోరారు.