జాతీయ వార్తలు

చర్చా మార్గం శరణ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 26: హింస, ఆయుధాల వల్ల ఏ సమస్య పరిష్కారం కాదని, దేనినైనా శాంతియుత చర్చల ద్వారానే నివృత్తి చేసుకోవాల్సి ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు కొత్త సమస్యలను సృష్టించుకుని పోవడం వల్ల ఎలాంటి ఉపశమనం ఉండదని కొత్త ఏడాదిలో తొలిసారిగా ఆదివారం జరిగిన మన్‌కీ బాత్ కార్యక్రమంలో మోదీ పేర్కొన్నారు.
హింసాత్మక చర్యల వల్లే సమస్యలను పరిష్కరించుకోవచ్చన్న అభిప్రాయం నుంచి బయటపడి జనజీవన స్రవంతిలో కలవాలని మోదీ అన్నారు. శాంతియుతంగా సమస్యలను పరిష్కరించుకోవడంలో భారత్‌కు ఉన్న శక్తిసామర్థ్యాలపై విశ్వాసం ఉంచి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇటీవల కాలంలో ఈశాన్య భారతంలో ఉగ్రవాదం గణనీయంగా తగ్గుముఖం పట్టిందని పేర్కొన్న మోదీ ‘గణతంత్ర దినోత్సవం సందర్భంగా మీ అందరినీ మనస్పూర్తిగా కోరుతున్నా, దేశంలో ఎక్కడా ఎలాంటి హింసాకాండకు పాల్పడకండి. హింస, ఆయుధాల వల్ల ఎలాంటి శాంతి చేకూరదు’ అని అన్నారు. శాంతియుత వాతావరణంలో ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకోగలిగే నవ భారత నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కలిసి రావాలని ప్రధాని మోదీ కోరారు. ఇటీవల 8 ఉగ్రవాద సంస్థలకు చెందిన 644 మంది తీవ్రవాదులు తమ ఆయుధాలను ప్రభుత్వానికి అప్పగించిన విషయాన్ని మోదీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. అంతకు ముందు వరకూ హింసా పథంలోనే జీవితాన్ని గడిపిన వీరందరూ శాంతియుతంగా సమస్యలను పరిష్కరించుకోవడంపై విశ్వాసాన్ని ప్రకటించారని, జన జీవన స్రవంతిలో కలిసి దేశ ప్రగతిలో భాగస్వాములు కావాలని నిర్ణయించుకున్నారని మోదీ తెలిపారు. గత ఏడాదిలో 80 మంది ఆయుధాలు వీడి జన జీవన స్రవంతిలో కలిసారని, హింస వల్ల సమస్యలు పరిష్కారమవుతాయని తప్పుడు అభిప్రాయం నుంచి బయటపడి శాంతి బాట పట్టారని ప్రధాని గుర్తు చేశారు. ఈశాన్య భారతంలో ఉగ్రవాదం గణనీయంగా తగ్గుముఖం పట్టడానికి ప్రధాన కారణం చర్చల ద్వారా ఆ ప్రాంత ప్రతి సమస్యనూ నిజాయితీగా శాంతియుతంగా పరిష్కరించడమేనని మోదీ పేర్కొన్నారు. 21వ శతాబ్దం విజ్ఞానం, శాస్త్ర విజ్ఞానం ప్రజాస్వామ్య వ్యవస్థలకు సంబంధించినదని ఉద్ఘాటించిన మోదీ ‘హింసాకాండ వల్ల జీవితాలు మెరుగైన విషయం ఎక్కడైనా విన్నామా?’ అని ప్రశ్నించారు. అలాగే ఆనందకరమైన జీవనానికి శాంతి, సుహృద్భావాలు ప్రతిబంధకాలుగా మారడం కూడా ఎక్కడా జరగలేదని తెలిపారు హింస వల్ల ఏ సమస్య పరిష్కారం కాదని, ఎప్పటికప్పుడు కొత్త వాటిని సృష్టించుకుని పోవడం వల్ల మిగిలేది శాశ్వత అశాంతేనని మోదీ అన్నారు.
సహకార సమాఖ్య వ్యవస్థ స్పూర్తితో త్రిపురలో శరణార్థుల సమస్యను పరిష్కరించుకోగలిగామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం త్రిపుర, మిజోరం ప్రభుత్వాలు కలిసి కట్టుగా పని చేయడం వల్లే బ్రూ-రియాంగ్ శరణార్థుల సమస్య పరిషృతమైందని ఆయన తెలిపారు.
కేంద్రంలో, రాష్ట్రంలోనూ ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా వీరి సమస్య పరిష్కారం కాలేదని మిజోరాన్ని వదిలి త్రిపురలో ఏర్పాటు చేసిన తాత్కాలిక శిబిరాల్లోనే వీరి తలదాచుకోవాల్సి వచ్చిందని మోదీ గుర్తు చేశారు. ఎలాంటి వౌలిక సౌకర్యాలు లేని ఈ శిబిరాల్లో శరణార్థులు ధైన్యమైన జీవితాన్ని గడిపారని, భవిష్యత్తులో ఏమి జరుగుతుందో తెలియని అనిశ్చితి వారిని అనునిత్యం వెంటాడిందని మోదీ అన్నారు. అయినప్పటికీ కూడా భారత రాజ్యాంగం పట్ల బలమైన విశ్వాసంతోనే వారు జీవితాలు సాగించారని, అంతిమంగా ఆ సమస్య పరిష్కారమైందన్నారు. 34 వేల మంది బ్రూ శరణార్థులకు త్రిపురలో పునరావాసం కల్పిస్తామని, ఇందు కోసం వీరి సమగ్ర వికాసానికి ప్రభుత్వం దాదాపు 600 కోట్ల రూపాయలు అందిస్తుందని మోదీ తెలిపారు.