జాతీయ వార్తలు

అలరించిన మోదీ తలపాగ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 26: గణతంత్ర, స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు వచ్చాయంటే ప్రధాని నరేంద్ర మోదీ ధరించే తలపాగ ఎలా ఉంటుందన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ కలుగుతుంది. ఎందుకంటే ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రతి రిపబ్లిక్ దినోత్సవానికి భిన్న రంగుల తలపాగాలు ధరించి మోదీ ప్రతి ఒక్కరినీ అలరిస్తూ వస్తున్నారు. ఈ ఆనవాయితీని ఆదివారం జరిగిన 71వ గణతంత్ర దినోత్సవాల్లోనూ ఆయన కొనసాగించారు. సాంప్రదాయక కుర్తా-పైజామా, పైన జాకెట్‌తో ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సారి కూడా సఫా బ్యాండ్‌హెజ్ టర్బాన్‌తో ఈ వేడుకల్లో పాల్గొని ఆయన అందరి దృష్టినీ ఆకర్షించారు.