జాతీయ వార్తలు

అమర జవాన్లకు ప్రధాని మోదీ నివాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 26: గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ వివిధ సందర్భాల్లో అమరులైన సైనికులకు నివాళి అర్పించారు. ఇండియా గేట్ వద్ద కొత్తగా నిర్మించిన అమర జవాన్ల స్మారక స్థూపంపై ప్రధాని మోదీ పుష్పగుచ్చం ఉంచి నివాళి అర్పించారు. ఇండియా గేట్ వద్ద నిర్మించిన స్మారక స్థూపాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గత ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించిన సంగతి తెలిసిందే. 1971 సంవత్సరంలో ఇండియా-పాకిస్తాన్‌ల మధ్య జరిగిన యుద్ధంలో అమరులైన జవాన్ల స్మారకార్థం 1972లో ఇండియా గేట్ వద్ద నిర్మించారు. స్మారక స్థూపం సుమారు 40 ఎకరాల్లో ఉంది. అమర్ చక్ర, వీర చక్ర, త్యాగ్ చక్ర, రక్షక్ చక్ర పొందిన 25,942 మంది సైనికుల పేర్లను గ్రానైట్ ఫలకంపై బంగారు అక్షరాలతో రాశారు. 15.5 మీటర్ల ఎతె్తైన స్తంభంపై శాశ్వత జ్వాల, సైన్యం ప్రసిద్ధ యుద్ధాలను తలపించే కుడ్య చిత్రాలు ఉన్నాయి. ఇండియన్ ఆర్మీ, నేవీ, ఏయిర్ ఫోర్సు సైనికుల చిత్రాల గ్యాలరీని ఏర్పాటు చేశారు. 1962లో జరిగిన ఇండో-చైనా యుద్ధం, ఇండియా-పాక్‌ల మధ్య 1947, 1965, 1971 యుద్ధాలు, 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో మరణించిన సైనికులకు దీనిని అంకితం చేశారు. ఇలా వివిధ యుద్ధాల్లో అమరులైన జవాన్ల పేర్లను శిలాఫలకంపై రాశారు.
'చిత్రం... ఢిల్లీలోని జాతీయ వార్ మెమోరియల్ వద్ద వీర జవాన్లకు ఆదివారం నివాళులు అర్పిస్తున్న ప్రధాని మోదీ