జాతీయ వార్తలు

చట్టసభల కర్తవ్యం.. హక్కుల పరిరక్షణే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రజల హక్కులను పరిరక్షించడమే చట్టసభల ప్రధాన కర్తవ్యమని తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి పేర్కొన్నారు. సోమవారం పార్లమెంట్‌లో లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అధ్యక్షతన కామన్‌వెల్త్ దేశాల పార్లమెంటరీ సదస్సుకు సంబంధించిన సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి శాసనసభ స్పీకర్లు, మండలి చైర్మన్లు, కార్యదర్శులు పాల్గొన్నారు. తెలంగాణ నుంచి మధుసూదనాచారి, స్వామిగౌడ్, వి.నర్సింహాచార్యులు హాజరయ్యారు. చట్టసభల్లో అనుసరించాల్సిన అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. అనంతరం మధుసూదనాచారి మాట్లాడుతూ సమాజంలో అసమానతలు లేకుండా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా విధివిధానాలను రూపొందించి చట్టాలను అమలు చేయడమే లక్ష్యంగా సమావేశంలో చర్చించామని వెల్లడించారు. గత ఫిబ్రవరిలో బిహార్‌లోని బుద్ధగయలో జరిగిన కామన్‌వెల్త్ దేశాల పార్లమెంటరీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై సోమవారం జరిగిన సమావేశంలో సమీక్షించినట్టు తెలిపారు. తదుపరి సదస్సు ముంబయిలో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. తెలంగాణలో పర్యటించాలని సుమిత్రా మహాజన్‌కు విజ్ఞప్తి చేయగా సానుకులంగా స్పందిచారని ఆయన వెల్లడించారు. స్వామిగౌడ్ మాట్లాడుతూ దేశంలోని వివిధ రాష్ట్రాల శాసనసభ స్పీకర్లు, మండలి చైర్మన్లతో ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్సులు నిర్వహిస్తే బాగుంటుందని సూచించినట్టు చెప్పారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చట్టసభల్లో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు ఈ కాన్ఫరెన్స్ ఉపయోగపడుతుందని వివరించామని మండలి చైర్మన్ చెప్పారు. దీనికి సుమిత్రా మహాజన్ సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు.
ఘనంగా పూలే, అంబేద్కర్ జయంతి
మహాత్మా జ్యోతిబా పూలే, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు సోమవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, శాసన సభాపతి మధుసూదనాచారి పాల్గొన్నారు. స్వామిగౌడ్ మాట్లాడుతూ జ్యోతిబా పూలే, అంబేద్కర్ దేశానికి మార్గదర్శనం చేశారని పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ను అన్ని వర్గాల ప్రజలు గురువుగా ఆరాధిస్తారని, అలాగే బడుగు, బలహీన వర్గాల జీవితాల్లో వెలుగు నింపిన జ్యోతిబా పూలేను ఆదర్శవంతునిగా అంగీకరించారని స్వామిగౌడ్ పేర్కొన్నారు.