జాతీయ వార్తలు

భారతీయ విశ్వరూపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

*రాజ్‌పథ్‌లో భారతీయ విశ్వరూపం భిన్న కోణాల్లో ఆవిష్కృతమైంది. చారిత్రక, సాంస్కృతిక, సంప్రదాయాలు మహోన్నత రీతిలో కనువిందు చేశాయి. 71వ గణతంత్ర దినోత్సవం సర్వసత్తాక భారతీయ మహోత్సవంగానే సాగింది. సైనిక శక్తి దేదీప్యమైంది. ప్రగతి రథాలు పరుగులు పెట్టాయి. భిన్నత్వంలో ఏకత్వం భావనకు పట్టం కడుతూ అభివృద్ధే ఆలంబనగా పలు రాష్ట్రాలు రూపొందించిన శకటాలు శోభాయమానమయ్యాయి. భారతదేశ శక్తి, యుక్తి, చారిత్రక వైభవం మేళవింపుగా సాగిన రిపబ్లిక్ దినోత్సవ కవాతు అమోఘం.. అపూర్వం. వేలాదిమంది ప్రజల సమక్షంలో ఈ అద్భుత విన్యాసాలను రాష్ట్రపతి కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, ముఖ్య అతిథిగా వచ్చిన జాయేద్ బాల్సోనారోతోపాటు అనేకమంది రాజకీయ ప్రముఖులు తిలకించారు.