జాతీయ వార్తలు

కేరళలో భారీ మానవహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం, జనవరి 26: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కేరళలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం అధికార సీపీఐ(ఎం) నేతృత్వంలోని లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డీఎఫ్) 620 కిలో మీటర్ల పొడవున భారీ మానవహారాన్ని ఏర్పాటు చేసింది. ఎల్‌డీఎఫ్ కేరళలోని ఉత్తర ప్రాంతంలో గల కాసరగోడ్ నుంచి దక్షిణ ప్రాంతంలోని కలియక్కవిలై వరకు ఈ మానవహారాన్ని ఏర్పాటు చేసింది. ఈ భారీ మానవహారంలో సుమారు 75 లక్షల మంది పాల్గొన్నారని ఎల్‌డీఎఫ్ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలని ప్రయత్నిస్తోందని, కాని తాము దాన్ని రక్షించుకుంటామని మానవహారంలో పాల్గొన్న వారంతా ప్రతినబూనారు. రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో నిర్వహించిన ఆందోళనలో ముఖ్యమంత్రి, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు పినరయి విజయన్, సీపీఐ నాయకుడు కనమ్ రాజేంద్రన్ పాల్గొన్నారు. సీఎం విజయన్ తన కుటుంబ సభ్యులతో కలిసి తిరువనంతపురంలో మానవహారంలో పాల్గొన్నారు. సీఏఏకు నిరసనగా నిర్వహించిన మానవహారంలో పాల్గొన్న వారందరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సీఏఏకు వ్యతిరేకంగా కేరళ రాష్ట్రం అంతా ఒక్కతాటిపై నిలబడిందని ఆయన అన్నారు. ‘ఈరోజు కేరళ మొత్తం ఒక్కటయి సీఏఏను నిరసించింది. ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కాని, ఇది విరామం తీసుకునే సమయం కాదు. మన నిరసనను కొనసాగించవలసిన అవసరం ఉంది. సీఏఏ, జాతీయ జనాభా రిజిస్టరు (ఎన్‌పీఆర్), జాతీయ పౌర రిజిస్టరు (ఎన్‌ఆర్‌సీ)లను రాష్ట్రంలో అమలు చేయబోమని మనం ఇప్పటికే స్పష్టం చేశాం. సీఏఏను రద్దు చేయాలని మనం డిమాండ్ చేస్తున్నాం. ఈ చట్టం దేశానికి, దేశ లౌకికతత్వానికి ప్రమాదకరం’ అని విజయన్ మానవహారం అనంతరం తిరువనంతపురంలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ అన్నారు. పార్లమెంటు సీఏఏను ఆమోదించిన రోజు నుంచి కేరళ రాష్ట్రం ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తూ వస్తోందని ఆయన పేర్కొన్నారు. ‘సీఏఏకు వ్యతిరేకంగా నిరసన తెలపడానికి లక్షలాది మంది వీధుల్లోకి వచ్చారు. మనం ఎలాంటి హింసకు తావివ్వకుండా మన గట్టి నిరసనను వ్యక్తం చేస్తున్నాం. ఈరోజు అనేక ప్రాంతాలలో మానవహారం ఒక మానవగోడ వలె మారిపోయింది’ అని ముఖ్యమంత్రి విజయన్ అన్నారు. ఇదిలా ఉండగా, మలప్పురంలో నిర్వహించిన మానవహారంలో జమ్మూకాశ్మీర్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే మొహమ్మద్ యూసుఫ్ తరిగామి పాల్గొన్నారు.