జాతీయ వార్తలు

రానున్న మూడేళ్లలో మూడు ఎక్స్‌ప్రెస్ హైవేలు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 26: ఢిల్లీ- ముంబయి ఎక్స్‌ప్రెస్‌వే సహా మూడు ఎక్స్‌ప్రెస్‌వేలను రానున్న మూడేళ్లలో పూర్తిచేయనున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆదివారం ఇక్కడ తెలియజేశారు. 2025 నాటికి మొత్తం 3.10 లక్షల కోట్ల వ్యయంతో ఏడువేల 500 కిలోమీటర్ల నిడివిగల 22 ప్రాజెక్టులను పూర్తి చేయాలన్న సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోందని గడ్కరీ చెప్పారు. ‘ప్రధానమైన ముంబయి-్ఢల్లీ ఎక్స్‌ప్రెస్ హైవేను మూడేళ్లలో పూర్తి చేయనున్నాం.. మొత్తం 18 హైవే ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఇప్పటికే ప్రారంభించాం’ అని గడ్కరీ వివరించారు. 51 ప్యాకేజీలతో వీటి నిర్మాణాన్ని ప్రారంభించినట్లు పేర్కొన్నారు. 1320 కిలోమీటర్ల మేర ముంబయి-్ఢల్లీ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణం పూర్తయితే.. 24గంటల ప్రయాణ వ్యవధి కేవలం 13 గంటల్లోనే పూర్తవుతుందని వివరించారు. హైవే ప్రాజెక్టుల్లో ఆరు ప్రాజెక్టులు 2,250 కిలోమీటర్ల నిడివితో ఎక్స్‌ప్రెస్‌వేలను 1.45 లక్షల కోట్లతో నిర్మిస్తున్నామని వివరించారు. మిగిలిన 16 ప్రాజెక్టులు గ్రీన్‌ఫీల్డు కారిడార్లని ఆయన పేర్కొన్నారు. వీటికి 1.65 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నామని గడ్కరీ తెలిపారు. ఢిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్ హైవేతో పాటు ట్రాన్స్-రాజస్థాన్, ట్రాన్స్-హర్యానా ప్రాజెక్టులు వచ్చే మూడేళ్లలో పూర్తి కానున్నాయని చెప్పారు. భూసేకరణ నిమిత్తం 16వేల కోట్లు వెచ్చిస్తున్నట్లు గడ్కరీ పేర్కొన్నారు.
'చిత్రం... కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ