జాతీయ వార్తలు

సరిహద్దుల్లో అలెర్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 27: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌పై కేంద్రం మరింత అప్రమత్తమైంది. పొరుగునే ఉన్న నేపాల్ సరిహద్దులో కరోనా కేసు బయటపడడంతో ప్రత్యేక దృష్టి సారించినంట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సోమవారం ఇక్కడ వెల్లడించింది. నేపాల్ సరిహద్దు జిల్లాలకు వైద్య బృందాలను తరలించారు. పశ్చిమ బెంగాల్-నేపాల్ సరిహద్దు జిల్లా పనిటాన్కీ, ఉత్తరాఖండ్‌లోని జౌలాఘాట్, జౌల్‌జిబీ, పితోర్‌గఢ్‌లో అప్రమత్తమయ్యారు. నేపాల్ ముఖ ద్వారమైన పనిటాన్కీలో వైరస్ కేసు నిర్ధారణ అయింది. వైరస్ వ్యాప్తిచెందకుండా ప్రత్యేక బృందాలను సరిహద్దుల వెంబడి మోహరించినట్టు ఆరోగ్యమంత్రిత్వశాఖ ప్రకటించింది. దేశ రాజధాని ఢిల్లీలోని ఎయిమ్స్, ఆర్‌ఎంఎల్ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసినట్టు ట్వీట్ చేశారు. ఎక్కడైన వైరస్ లక్షణాలు బయటపడితే తక్షణం కదిలేలా యంత్రాంగాన్ని సమాయత్తం చేశారు. ఇలా ఉండగా నేషనల్ సెంటర్ ఫర్ డీసీజెస్ కంట్రోల్(ఎన్‌సీడీసీ) వైద్య నిపుణులు సోమవారం ఢిల్లీలోని ఆర్‌ఎంఎల్ ఆసుపత్రిని సందర్శించారు. ప్రత్యేక వార్డు, అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులో సమీక్షించినట్టు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఎన్‌సీడీసీ డైరెక్టర్ డాక్టర్ సుర్జిత్ సింగ్ నేతృత్వంలోని వైద్యులు ఐసోలేషన్ వార్డులను తనిఖీ చేశారని ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది.
*చిత్రం... చైనా నుంచి భారత్ వచ్చే ప్రయాణికులపై కరోనా వైరస్ స్క్రీనింగ్ జరిపేందుకు
ఢిల్లీలో ఏర్పాటు చేసిన థర్మల్ స్క్రీనింగ్ పరికరాలు