జాతీయ వార్తలు

అవి రాజ్యాంగ తప్పిదాలే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగుళూరు, జనవరి 27: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న తీర్మానాలు రాజ్యాంగ తప్పిదాలేనని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. తమకు మెజారిటీ ఉన్న అసెంబ్లీల్లో సీఏఏ వ్యతిరేక తీర్మానాలు చేయడం ద్వారా రాజ్యాంగ తప్పిదానికి పాల్పడవద్దని ఆయన హితవు పలికారు. విపక్ష ధర్మాన్ని వదిలి రాష్ట్ర ధర్మాన్ని పాటించాలని సోమవారంనాడు ఇక్కడ జరిగిన ఒక ర్యాలీలో ఆయన అన్నారు. ప్రతిపక్ష ప్రభుత్వాలు ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని గట్టిగా కోరుతున్నానని తెలిపారు. పౌరచట్టంపై కాంగ్రెస్ పార్టీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని అన్నారు. పాకిస్తాన్‌కు చెందిన శరణార్థులకు పౌరసత్వాన్ని కల్పించాలని 1947 నవంబర్‌లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానాన్ని చేపట్టిందని ఆయన గుర్తు చేశారు. అలాంటపుడు మోదీ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ఆయన కాంగ్రెస్ నాయకులను నిలదీశారు. కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించిన 370 అధికరణ రద్దు నేపథ్యంలో కాశ్మీరీ పండిట్ల పునరాగమనాన్ని ప్రపంచంలో ఏ శక్తీ అడ్డుకోలేదని రాజ్‌నాథ్ ఉద్ఘాటించారు. అదే క్రమంలో పాక్‌కు ఓ బలమైన సందేశాన్ని ఇచ్చిన ఆయన ‘్భరతదేశం తనంతట తానుగా ఎవరి జోలికీ వెళ్లదు. కానీ ఎవరైనా ఇబ్బంది పెడితే వారిని మనశ్శాంతిగా ఉండనివ్వం’ అని అన్నారు. ఇక అంతర్జాతీయ వేదికలపై కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తే సాహసం కూడా పాకిస్తాన్ చేయజాలదని ఆయన అన్నారు. ఈ పొరుగు దేశంతో చర్చలంటూ జరిగితే అవి ఆక్రమిత కాశ్మీర్‌పైనేనని రాజ్‌నాథ్ తేల్చిచెప్పారు. అన్ని దేశాలతోనూ సత్సంబంధాలను పెంపొందించుకోవడానికి మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పేర్కొన్న ఆయన అయోధ్యలో ఆలయ నిర్మాణం, ట్రిపుల్ తలాక్ రద్దు వంటి ఎన్నో కీలక నిర్ణయాలను తీసుకుందని అన్నారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని గట్టిగా సమర్థించిన రాజ్‌నాథ్ సింగ్ ఇది ఏ మత మనోభావాలను దెబ్బతీసే చట్టం కాదని, మత వేధింపులకు గురైన వారికి ఉపశమనాన్ని కలిగించేదేనని తెలిపారు. లౌకికేతర దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గాన్ నుంచి మత వేధింపుల కారణంగా భారత్ వచ్చిన వారికి హక్కులను, రక్షణను కల్పించే ఉద్దేశంతోనే ఈ చట్టాన్ని తెచ్చామని అన్నారు. మత ప్రాతిపదికన ఎవరి పట్ల వివక్ష కనబరిచే అవకాశమే లేదని, అందరి సంక్షేమమే మోదీ ఆశయమని ఆయన ఉద్ఘాటించారు. ఈ చట్టం వల్ల భారత్‌లో ఉన్న ముస్లిం పౌరసత్వానికి ఏ రకమైన హాని కలుగదని అన్నారు. ఈ మూడు దేశాలకు చెందిన ముస్లిమేతరులకు పౌరసత్వాన్ని కల్పించడానికి ప్రయత్నిస్తున్న ప్రభుత్వాలు ముస్లింలకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నాయని ఆయన గుర్తు చేశారు. ‘బంగ్లాదేశ్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ లౌకిక దేశాలు కాదు. మత ప్రాతిపదికన ఏర్పడ్డ దేశాలు. ఈ దేశాల్లో ఇస్లామే ప్రధాన మతం. భారత్‌ది హిందూ మతం కాదు. లౌకిక దేశం. ఈ మూడు దేశాల్లో ఇస్లాం మతాన్ని పాటిస్తున్నవారు వేధింపులకు గురయ్యే అవకాశం ఉండదు. అక్కడ ఇబ్బంది పడేది ముస్లిమేతర మైనారిటీలే’ అని రాజ్‌నాథ్ వివరించారు.
*చిత్రం... పౌరసత్వ చట్టానికి అనుకూలంగా సోమవారం మంగుళూరులో జరిగిన ఓ ర్యాలీలో మాట్లాడుతున్న కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్