జాతీయ వార్తలు

ఆ దేశం అంతర్గత అంశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 27: భారత దేశం కొత్తగా తీసుకుని వచ్చిన పౌరసత్వ సవరణ చట్టం ఆ దేశం అంతర్గత అంశమని ఫ్రాన్స్ వ్యాఖ్యానించింది. పౌరసత్వ సవరణ చట్టం ఆ దేశ అంతర్గత రాజకీయ అంశంగా యూరోపియన్ పార్లమెంట్‌లో సోమవారం ఫ్రాన్స్ పేర్కొన్నట్లు ఫ్రెంచ్ దౌత్యవేత్త వర్గాల సమాచారం. 751 మంది సభ్యులు గల యూరోపియన్ పార్లమెంటులో 600 మంది సభ్యులు పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆరు తీర్మానాలు చేపట్టిన తర్వాత ఈ వాదన వచ్చింది. పౌరసత్వ సవరణ చట్టం అమలు భారత దేశం పౌరసత్వ పాలనలో ప్రమాదకరమైన మార్పుగా యూరోపియన్ పార్లమెంటు వ్యాఖ్యానించింది. ఇదిలాఉండగా పౌరసత్వ సవరణ చట్టం భారత దేశం అంతరంగిక అంశంగా ఫ్రాన్స్ వ్యాఖ్యానించింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్‌లోని ముస్లీంయేతర మైనారిటీలకు పౌరసత్వం కల్పించడం కోసమేనని భారత్ ప్రకటించిందని యూరోపియన్ పార్లమెంటులో ప్రస్తావనకు వచ్చింది. భారత్‌లో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయన్న అంశం చర్చకు వచ్చింది. ఆయా ప్రభుత్వాలు అక్కడి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటాయని తెలిపింది. యూరోపియన్ పార్లమెంటులో చేసే తీర్మానాలను భారత్ వ్యతిరేకించినంత మాత్రాన అది వివక్ష కాదని పేర్కొంది.