జాతీయ వార్తలు

పౌరసత్వ చట్టాన్ని ఉపసంహరించుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, జనవరి 27: పౌరసత్వ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ పశ్చిమ బెంగాల్ అసెం బ్లీ సోమవారం తీర్మానం ఆమోదించింది. అదేవిధంగా ఎన్‌పీఆర్, ఎన్‌ఆర్‌సీలను కూడా ఉపసంహరించుకోవాలని తీర్మానంలో పేర్కొంది. ఈ తీర్మానాన్ని కాంగ్రెస్, సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ మద్దతునిచ్చింది. ఇదిలాఉండగా బీజేపీ శాసనసభాపక్షం తీర్మానాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. పైగా పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకుని వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీని, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను అభినందించింది, కృతజ్ఞతలు తెలిపింది. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఇదివరకే కేరళ, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాలు తీర్మానాన్ని ఆమోదించగా, పశ్చిమ బెంగాల్ కూడా తీర్మానాన్ని ఆమోదించింది. 2019 సెప్టెంబర్‌లో ఎన్‌ఆర్‌సీని వ్యతిరేకిస్తూ పశ్చిమ బెంగాల్ తీర్మానాన్ని ఆమోదించింది.
డిస్మిస్ చేసుకోండి: మమత
ఇదిలాఉండగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రసంగిస్తూ కేంద్ర ప్రభుత్వ చర్యను తూర్పారబట్టారు. సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌ల అమలు అప్రజాస్వామికమని, మానవత్వం లేనివని ఆమె మండిపడ్డారు. ప్రజావ్యతిరేకమైన వీటిని వెంటనే ఉపసంహరించుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. వీటిని ఉమ్మడిగా ఎదుర్కొందామని ఆమె కాంగ్రెస్‌కు, సీపీఎం నేతృత్వంలోని ఫ్రంట్‌కు పిలుపునిచ్చారు. ప్రభుత్వంపై కట్టుకథలు చెప్పడం మానుకోవాలని ఆమె కోరారు. ఢిల్లీలో జరగబోయే ఎన్‌పీఆర్ సమావేశానికి హాజరుకాకుండా ఉండే ధైర్యం తమకు ఉందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ధైర్యం ఉంటే తమ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని మమత అన్నారు.
*చిత్రం... కోల్‌కతాలో సోమవారం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతున్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ