జాతీయ వార్తలు

ఇన్‌టర్న్‌షిప్ మాత్రమే.. ఉద్యోగం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 28: ఇన్‌టెర్న్‌షిప్ అనేది తాము నిర్వహించదలచుకున్న కార్యక్రమాల్లో ఓ భాగం మాత్రమేనని, దానిని ఉద్యోగమని నుకోవడానికి వీల్లేదని నిరుద్యోగ యువతకు సీబీఐ స్పష్టం చేసింది. ఈ విషయంలో వెలవడుతున్న ప్రకటనలను చూసి మోసపోవద్దని హెచ్చరించింది. గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన లేదా రీసెర్చ్ చేస్తున్న విద్యార్థులకు ఇన్‌టర్న్‌షిప్ ప్రోగ్రామ్‌ను సీబీఐ ఇటీవల ప్రకటించింది. న్యాయ శాస్త్రం, సైబర్ డాటా, డాటా ఎనాలిసిస్, క్రిమినాలజీ, మేనేజ్‌మెంట్, ఎకనామిక్స్, కామర్స్ వంటి విభాగాల్లోని వారికి ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలిపింది. డిజిటల్ ఫోరెన్సిక్స్‌సహా ఫోరెన్సిక్ విభాగానికి కూడా ఇథోధిక ప్రాధాన్యం ఉంటుందని పేర్కొంది. కాగా, ఈ ప్రకటనను ఉద్యోగావకాశాలుగా పేర్కొంటూ పలువురు వ్యక్తులు, సంస్థలు పుంఖానుపుంఖంగా ప్రకటనలు గుప్పిస్తున్నాయి. ‘సీబీఐ నిర్వహిస్తున్న ఆరు నుంచి ఎనిమిది వారాలు ఉండే ఈ ఇన్‌టెర్న్‌షిప్‌కు ఎన్నికైన వారికి స్టయిఫండ్ లభిస్తుంది. అంతేగాక, దీనిని సమర్థంగా పూర్తి చేసుకుంటే, సీబీఐలో పర్మనెంట్ ఉద్యోగాలు వస్తాయి’ అంటూ లెక్కలేనన్ని ప్రకటనలు వెలువడుతున్నాయి. ఈ వ్యవహారం తమ దృష్టికి వచ్చిందని, ఇలాంటి వార్తలను నమ్మవద్దని సీబీఐ తేల్చిచెప్పింది. ఇన్‌టెర్న్‌షిప్‌కు ఎన్నికైన వారికి స్టుయిఫండ్ అంటూ ఏదీ ఉండదని పేర్కొంది. భోజనం, వసతిని ఎవరికివారే ఏర్పాటు చేసుకోవాలని తెలిపింది. అంతేగాక, ఇన్‌టెర్న్‌షిప్‌తో ఉద్యోగాలకు ఎలాంటి సంబంధం లేదని, దీనిని పూర్తి చేసిన వారికి ఉద్యోగాలు వస్తాయనడంలో అర్థం లేదని పేర్కొంది.
ఇన్‌టెర్న్‌షిప్‌పై, ఆతర్వాత ఉద్యోగాలు వస్తాయనే వార్తలపై ఎవరైనా స్పందించి, వ్యక్తులు లేదా బృందాలు లేదా సంస్థలతో ఎవరైనా చర్చించినా, ఏవైనా నిర్ణయాలు తీసుకున్నా, ఒప్పందాలు కుదుర్చుకున్నా తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఎవరికివారు సొంతంగా బాధ్యత వహించాలని, అలాంటి మోసాల్లో సీబీఐకి ఎలాంటి ప్రమేయం ఉందని మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో సీబీఐ వివరించింది. వివిధ అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడానికే ఇన్‌టెర్న్‌షిప్‌ను నిర్వహిస్తున్నామని, దీని వల్ల ఉద్యోగాలు వస్తాయనుకోరాదని తెలిపింది. దీనికి సంబంధించి ఎలాంటి విషయాల్లోనైనా వ్యక్తులు లేదా సంస్థలను నమ్మి మోసపోవద్దవి హితవు పలికింది.