జాతీయ వార్తలు

బీజేపీలోకి సైనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 29: హైదరాబాదుకు చెందిన ప్రపంచ బ్యాడ్మింటన్ మాజీ ఛాంపీయన్ సైనా నెహ్వాల్, ఆమె పెద్దక్క చంద్రాంశు నెహ్వాల్ భారతీయ జనతా పార్టీలో చేరారు. ఢిల్లీ శాసనసభ ఎన్నికలు జరుగుతున్న సమయంలో హర్యానాకు చెందిన సైనా నెహ్వాల్, చంద్రాంశు నెహ్వాల్ బీజేపీలో చేరడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్నది. దేశాభివృద్ది కోసం అహర్నిశలు కష్టపడుతున్న ప్రధాని నరేంద్ర మోదీ తనకు ఆదర్శమని ఆమె చెప్పారు. ప్రధాని మోదీ తరహాలో దేశానికి కష్టపడి సేవ చేసేందుకే తాను బీజేపీలో చేరినట్లు సైనా నెహ్వాల్ విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. దేశం కోసం కష్టపడి పని చేస్తున్న నరేంద్ర మోడీ తనకు ఆదర్శమని ఆమె చెప్పారు. సైనా నెహ్వాల్ చాలా కాలం నుంచి బీజేపీని ముఖ్యంగా నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని సమర్థించడం, ఈ మేరకు ట్వీట్లు
చేయటం తెలిసిందే. దేశాభివృద్దికి కోసం కేంద్రంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని, దీనికి తన వంతు కృషి చేస్తానని ఆమె చెప్పారు. ‘నేను కష్టపడి పని చేసే క్రీడాకారిణి, నా తరహాలో కష్టపడి పని చేసే వారితో కలిసి పని చేయడం నాకు ఇష్టం, అందుకే నరేంద్ర మోదీ నాకు ఆదర్శం’ అని సైనా నెహ్వాల్ చెప్పారు. దేశం కోసం నిరంతరం పని చేస్తున్న నరేంద్ర మోదీతో కలిసి పని చేయగలిగితే అదృష్టవంతురాలినవుతానని సైనా అన్నారు. ఢిల్లీ బీజేపీ శాఖలో చేరిన సైనా నెహ్వాల్ ఆ తరువాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డాను కలిశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఖేలో ఇండియా పథకం తనకెంతో నచ్చిందని ఆమె అన్నారు. లండన్‌లో 2012లో జరిగిన ఓలంపిక్ క్రీడల్లో దేశానికి మొదటి రజిత మెడల్‌ను సాధించిన సైనా నెహ్వాల్‌ను కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డుతో పాటు అర్జున్ అవార్జుతో సత్కరించడం తెలిసిందే. ఇదిలాఉండగా సైనా ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ తరపున ఎన్నికల ప్రచారం చేయనున్నారు. యువ దిగ్గజంగా ఆమెను ఎన్నికల ప్రచారంలోకి దించడం ద్వారా దేశ రాజధాని ఢిల్లీలోని యువతను ఆకర్శించడం బీజేపీ లక్ష్యంగా కనిపిస్తోందని అంటున్నారు. హిందీతో పాటు హర్యాన్వీ భాషలో అనర్గళంగా మాట్లాడే సైనా ప్రచారంతో బీజేపీకి ఢిల్లీలోని హర్యానా ప్రజల ఓట్లు కూడా వస్తాయని ఆ పార్టీ నాయకుల అంచనా.
*చిత్రం... న్యూఢిల్లీలో బుధవారం బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో పార్టీలో చేరుతున్న బాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్, ఆమె సోదరి అబూ చంద్రాంశు నెహ్వాల్