జాతీయ వార్తలు

వైద్య విద్యా విధానంలో సంస్కరణలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: హోమియోపతి, భారతీయ వైద్య విద్యా విధానంలో సంస్కరణలు తీసుకునిరావడం, ప్రజల ప్రయోజనాల పరిరక్షణ కోసం జవాబుదారీని నిర్ధారించడం, పారదర్శకతను పెంచేందుకు ఈ సవరణలు ప్రతిపాదించారు. దేశంలోని అన్ని ప్రాంతాల్లో భరించగలిగే వైద్య సౌకర్యాలు అందజేయడాన్ని ఈ కమిషన్ ప్రోత్సహిస్తుందని ప్రభుత్వం తెలిపింది. భారతీయ వైద్య విధానం, భారతీయ వైద్య విద్యా రంగాన్ని సంస్కరించేందుకు సంబంధించిన బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రతిపాదిత నియంత్రణ విధానం భారతీయ వైద్య విధానం, వైద్య విద్యలో పారదర్శకత,
జవాబుదారీతనాన్ని తెస్తుందని ప్రభుత్వం తెలిపింది. దేశంలోని అన్ని ప్రాంతాల్లో భరించగలిగే వైద్య వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఈ నియంత్రణ వ్యవస్థ తోడ్పడుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. భారతీయ వైద్య విధానం, భారతీయ వైద్య విద్యా వ్యవస్థలను నియంత్రించటంతో పాటు అకాడమిక్ స్టాండర్డ్స్‌ను పెంచుతుందనీ, విద్యా సంస్థల గుర్తింపును నియంత్రిస్తుందని ప్రభుత్వం తెలిపింది. భారతీయ వైద్య, విద్యా విధానం నాణ్యతను పెంచడంతో పాటు ఉత్కృష్టమైన వైద్య సేవలను అందించడమే ఈ నియంత్రణ వ్యవస్థ ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది.