జాతీయ వార్తలు

మొండి కేసుల పరిష్కారం సవాలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్, సెప్టెంబర్ 17: కోర్టుల్లో పేరుకుపోయిన మొండి కేసులను పరిష్కరించడమే న్యాయ వ్యవస్థ ముందున్న అసలైన సవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకుర్ అన్నారు. అంతేకాదు చిన్న చిన్న కేసులను పరిష్కరించడాన్ని ఆయన ఇంట్లో పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేయడంతో పోల్చారు. శనివారం ఇక్కడ గుజరాత్ రాష్ట్ర జ్యుడీషియల్ అకాడమీని ప్రారంభించిన తర్వాత ఠాకూర్ మాట్లాడుతూ తాను పంజాబ్, హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు రెండు రాష్ట్రాల్లో పెద్దఎత్తున లోక్‌అదాలత్‌లు నిర్వహించి 14 లక్షల కేసులను పరిష్కరించిన విషయాన్ని గుర్తు చేశారు. ‘అప్పుడు మేము చిన్న చిన్న కేసులను పరిష్కరించడమంటే చీపురు పట్టుకుని ఇంటి చుట్టుపక్కల ఉన్న చెత్తా చెదారాన్ని తొలగించడంగా భావించాం. ఏళ్ల తరబడి కోర్టుల్లో మూలుగుతున్న మొండి కేసులను పరిష్కరించడమే అసలైన సవాలు’ అని అన్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి తాను ఏళ్ల తరబడి నానుతున్న 200 సివిల్, క్రిమినల్ కేసుల వివరాలు అందించాలని రెండు రాష్ట్రాల జడ్జీలను కోరినట్లు ఆయన చెప్పారు. వివరాలు అందాక ఈ పాత కేసులను పరిష్కరించడం ఇప్పుడు మన లక్ష్యమని వారికి చెప్పానన్నారు. ఆ కేసులను పరిష్కరించడానికి జడ్జీలను యూనిట్ సిస్టమ్ కిందికి తీసుకురావడం ద్వారా వారికి అదనపు వెయిటేజి ఇవ్వడం జరిగిందని, ఫలితంగా ఆరు నెలల్లోనే అంటే తాను సుప్రీంకోర్టుకు వెళ్లే సమయానికల్లా న్యాయాధికారులు 5,500కు పైగా అలాంటి కేసులను పరిష్కరించారని ఠాకూర్ చెప్పారు. అంతేకాదు కోర్టుల్లో కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయనే విషయాన్ని జడ్జీలు గనుక గ్రహించగలిగితే అన్ని సమస్యలను అధిగమించవచ్చన్న విశ్వాసాన్ని సైతం ఆయన వ్యక్తం చేశారు. కాగా, గుజరాత్‌లో అడుగుపెట్టగానే తనకు ఎంతో శాంతి లభించినట్లనిపిస్తుందని అన్నాఠు. ఒడిశాలో రవాణా సదుపాయం లేక పోవడంతో పది కిలోమీటర్లు భార్య శవాన్ని భుజంపై మోసుకెళ్లిన గిరిజనుడు దనా మఝి ఉదంతాన్ని ఈ సందర్భంగా ఠాకూర్ ప్రస్తావిస్తూ, ప్రభుత్వం కల్పించే వౌలిక సదుపాయాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోకపోతే అది వృథా ఖర్చుగా మిగిలిపోతుందని అన్నారు.

చిత్రం... గాంధీనగర్‌లోని రాజ్‌భవన్‌లో ప్రధాని నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్న టిఎస్ ఠాకూర్