జాతీయ వార్తలు

చేనేతకు చేయూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: తెలంగాణ రాష్ట్రంలో 14 చేనేత క్లస్టర్లను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని రాష్ట్ర చేనేత, జౌళి, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కే.తారక రామరావు విజ్ఞప్తి చేశారు. గురువారం ఢిల్లీలో కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీ అధ్యక్షతన జరిగిన అన్ని రాష్ట్రాల జౌళి శాఖ మంత్రుల సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా చేనేత రంగాన్ని అభివృద్ధి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలతోపాటు చేనేత కార్మికుల సంక్షేమంపై ప్రధానంగా చర్చించారు. అనంతరం మంత్రి కేటీఆర్ విలేఖరులతో మాట్లాడుతూ దేశంలో చేనేత కార్మికులకోసం కీలక పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తోందని పేర్కొన్నారు. చేనేత కార్మికుల సంక్షేమకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూ.1270కోట్లు రూపాయలను బడ్జెట్‌లో కేటాయించిందని చెప్పారు. చేనేత పరిశ్రమ అభివృద్ధికోసం ప్రత్యేకంగా రెండు కార్పొరేషన్లను ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా నూలుకు, అద్దకాలకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోందని ఆయన వెల్లడించారు. చేనేత కార్మికులకు వేతనాలు పెరిగే విధంగా యాభైశాతం సబ్సిడీలో 35శాతం కార్మికుడికి వేతనం చేరేలా రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాలను రూపొందించినట్టు చెప్పారు.
తెలంగాణ వ్యాప్తంగా చేనేత మగ్గాలు ఎక్కడున్నా వాటికి యూనిక్ కోడ్ ఏర్పాటు చేశామని చెప్పారు. సామాజిక భద్రతకోసం ‘చేనేతన్న చేయూత’ కార్యక్రమం ద్వారా కార్మికుడు రూపా యి కడితే రాష్ట్ర ప్రభుత్వం రెండు రూపాయల లబ్ధి చేకూరుస్తుందని ఆయన చెప్పారు. అలాగే దేశవ్యాప్తంగా చేనేత కార్మికులకు ఆరోగ్య బీమా కల్పించాలని కేంద్ర మంత్రికి ఈ సమావేశంలో విజ్ఞప్తి చేసినట్టు పేర్కొన్నారు.
జీఎస్టీ అమలు వల్ల చేనేత కార్మికులకు అనేక ఇబ్బందులు ఏర్పడ్డాయని, చేనేతకు సంబంధించిన వస్తువుల విభాగంలో వివిధ స్లాబ్‌ల రూపంలో పన్నులను వసులు చేస్తున్నారని, అలాకాకుండా చేనేతను పూర్తిగా ఒకే స్లాబ్ కిందకు తీసుకురావాలని కేంద్రాన్ని కోరినట్టుచెప్పారు. తెలంగాణలో 14 చేనేత క్లస్టర్లను ఏర్పాటు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్టు వెల్లడించారు. సంక్షేమ కార్యక్రమాలు అన్ని రాష్ట్రాల చేనేత కార్మికులకు అందేవిధంగా చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్టు కేటీఆర్ వెల్లడించారు. ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్‌తోపాటు జౌళి శాఖ డైరెక్టర్ శైలజరామ అయ్యర్, అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.