జాతీయ వార్తలు

వివాదాస్పద ప్రకటనలు చేయొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పలువురు సీనియర్ నేతలు చేసిన వివాదాస్పద ప్రకటనల ప్రభావం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరాజయానికి దారితీసిన నేపథ్యంలో బీజేపీ నాయకత్వం రానున్న అన్ని ఎన్నికల విషయంలోనూ ఆచితూచి వ్యవహరించబోతోంది. ముఖ్యంగా పార్టీ నేతలు ఎలాంటి వివాదాస్పద ప్రకటనలు చేయకుండా చాలా గట్టిగానే కట్టడి చేయాలని సంకల్పిస్తోంది. ముఖ్యంగా త్వరలోనే బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న దృష్ట్యా ఢిల్లీ ఎదురైన పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని పార్టీ నేతలు వ్యవహరించాలని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. బిహార్‌కు చెందిన ఎంపీ గిరిరాజ్ సింగ్ చేసిన వివాదాస్పద ప్రకటన అలజడి రేకెత్తించడంతో ఆయనను పిలిపించిన నడ్డా గట్టిగానే హెచ్చరించినట్టు తెలుస్తోంది. ఇస్లామిక్ కేంద్రంగా ఉన్న దేవబంద్‌ను ఉగ్రవాద గంగోత్రిగా గిరిరాజ్ సింగ్ అభివర్ణించడంతో పెద్ద వివాదమే చెలరేగింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పరాజయానికి దారితీసిన కారణాల్లో పార్టీ నేతలు చేసిన వివాదాస్పద ప్రకటనలు కూడా ఉన్నాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా సహా పలువురు సీనియర్ నేతలు పేర్కొన్న విషయం తెలిసిందే. ఢిల్లీ తరహా పరిస్థితులు రానున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తలెత్తకుండా బీజేపీ ముందు జాగ్రత్త పడుతోంది. ప్రస్తుతం బిహార్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర్లో ఉన్నందున అక్కడ విజయం సాధించడమే లక్ష్యంగా బీజేపీ పురోగమిస్తోంది. బీజీపీకి మచ్చతెచ్చే రీతిలో నేతలు ఎవరూ మాట్లాడకూడదని, ముఖ్యంగా అధికారంలో ఉన్న జేడీయూతో పొత్తును దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలని స్పష్టం చేసింది.
ఈ ఏడాది అక్టోబర్‌లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. జేడీయూ, బీజేపీ సంకీర్ణ కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సారథ్యం వహిస్తున్నారు.