జాతీయ వార్తలు

పర్యావరణ రక్షణపై జాప్యం కూడదు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాంధీ నగర్, ఫిబ్రవరి 16: వాతావరణ పరిరక్షణకు సంబంధించి ఎలాంటి జాప్యం లేకుండా కార్యాచరణ కార్యక్రమం చేపట్టేందుకు అన్ని దేశాలపై వత్తిడి తెచ్చేందుకు సంయుక్తంగా కృషి చేస్తామని భారత్-నార్వేలు ప్రకటించాయి. అలాగే ఇందుకు సంబంధించి వర్ధమాన దేశాలకు ఇచ్చిన ఆర్థిక సహాయ హామీపైనా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాష్ జవడేకర్ ఆదివారం నాడిక్కడ వెల్లడించారు. నార్వే పర్యావరణ మంత్రి స్వినుంగ్ రొటివాట్న్‌తో కేంద్ర మంత్రి ప్రకాష్ జవడేకర్ సమావేశమయ్యారు. ప్రపంచ పర్యావరణం, వన్యప్రాణుల రక్షణ వంటి వివిధ అంశాలపై ఇరువురూ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా జవడేకర్ మీడియాతో మాట్లాడుతూ నార్వే పర్యావరణ మంత్రితో జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయని అన్నారు. అభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞానం విషయంలో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించుకున్నామని ఆయన తెలిపారు. వ్యర్థ పదార్థాల నిర్వహణ, తర్వాత సముద్రపు లిట్టర్ వేగంగా తగ్గుతుందని, భారత దేశ శీతలీకరణ వేగంగా పెరుగుతుందని అన్నారు. వాతావరణ మార్పులపై అభివృద్ధి చెందిన దేశాలకు వాగ్దానాలు చేసి పదేళ్ళయినా అవి ముందుకు రాలేదన్న విషయాన్ని తాము ఈ సందర్భంగా నొక్కి చెప్పామన్నారు. అవి అనుసరించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ఒక ట్రిలియన్ డాలర్ల వద్ద ఉన్నా, అన్ని దేశాలు ఒక సంచలనం సృష్టించాలని ఆయన అన్నారు. అభివృద్ధి విషయంలో తాము అన్ని దేశాలతో భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా నిర్ణయించామని కేంద్ర మంత్రి జవడేకర్ తెలిపారు. నార్వే పర్యావరణ మంత్రి స్వీనుంగ్ రొటివాట్న్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో వివిధ దేశాలతో చేతులు కలిపి పని చేసేందుకు భారత్ ముందుకు రావడం సంతోషకరమన్నారు. పర్యావరణాన్ని కాపాడడంలో భారత్ చూపుతున్న ఆసక్తి తమకు ఎంతగానో నచ్చిందని ఆయన తెలిపారు. ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం, క్లీన్ ఇండియా కోసం తపన, దీని కోసం చేస్తున్న ప్రచారం తమను ప్రభావితం చేశాయన్నారు. భారత మంత్రి జవడేకర్‌తో పర్యావరణ పరిరక్షణ కోసం చర్చించామన్నారు. వ్యర్థ పదార్థాల వినియోగం కూడా ఆకర్షించిందన్నారు. పర్యావరణం, కాలుష్య నివారణ వంటి విషయంలో కలిసి పని చేస్తామని ఆయన తెలిపారు.

*చిత్రం...కేంద్ర మంత్రి ప్రకాష్ జవడేకర్