జాతీయ వార్తలు

ఇదో అసహజ ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 16: మహారాష్టలో ఉద్ధవ్ థాకరే సారథ్యంలోని ప్రభుత్వం అసహజం, అవాస్తవికమైనదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అభివర్ణించారు. నవీ ముంబయిలో ఆదివారం జరిగిన బీజేపీ సదస్సును ఉద్దేశించి మాట్లాడిన నడ్డా రాష్ట్రంలో థాకరే ప్రభుత్వం వచ్చినప్పటినుంచి అవినీతికి బ్రేకులు పడ్డాయని ఆరోపించారు. భవిష్యత్‌లో జరిగే అన్ని ఎన్నికల్లోనూ ఒంటరిగా పోటీ చేయడానికి పార్టీని సంసిద్ధం చేయాలని అన్నారు. గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకే ప్రజలు మెజారిటీ అప్పగించినప్పటికీ కొందరు వ్యక్తులు స్వలాభం కోసం పార్టీని వీడి ప్రతిపక్షంతో చేతులు కలిపారని నడ్డా అన్నారు. ఇప్పుడు అధికారంలోకి రాలేకపోయినా తదుపరి జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సొంతంగానే విజయం సాధిస్తుందని తెలిపారు. ఇక భవిష్యత్తులో జరిగే ఎన్నికలన్నింటిలో కూడా బీజేపీ ఒకవైపు, మిగతా పార్టీలన్నీ మరోవైపు అన్నవిధంగా జరుగుతాయని, అందుకు పార్టీ కార్యకర్తలు, నాయకులు ఇప్పటినుంచే సమాయత్తం కావాలని అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించినప్పటికీ థాకరే సారథ్యంలోని శివసేన తెగతెంపులు చేసుకోవడంతో అధికారాన్ని కోల్పోయిన విషయం తెలిసిందే. అనంతరం కాంగ్రెస్, ఎన్సీపీలతో కలసి ఉద్ధవ్ థాకరే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ రకమైన పరిస్థితికి కారణం పదవుల కోసం కొందరు వ్యక్తులు సిద్ధాంతాలను కాలరాసి ఇతర పార్టీలతో చేతులు కలపడమేనని అన్నారు. ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు రాష్ట్రం ఎంతగానో అభివృద్ధి చెందిందని, ఇప్పుడు ఎక్కడి పనులు అక్కడ ఆగిపోయాయని నడ్డా అన్నారు.
నవీ ముంబయిలో ఆదివారం జరిగిన బీజేపీ రాష్ట్ర మండలి సమావేశంలో పాల్గొన్న
*చిత్రం...పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ తదితరులు