జాతీయ వార్తలు

సంయమనం వీడొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీస్ వ్యవస్థ దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో ఉత్తమమైనదని హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఆదివారం ఇక్కడ జరిగిన 73 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాట్లాడిన ఆయన ‘అల్లరి మూకలను ఎదుర్కొనే విషయంలో గట్టిగా వ్యవహరించండి. అదే సమయంలో ఎంతగా రెచ్చగొట్టే పరిస్థితులు తలెత్తినా సంయమనం పాటించండి’ అని అన్నారు. ఎలాంటి వైఫల్యానికీ తావులేకుండా ఎన్నో కుట్రలను వమ్ము చేసిన ఘనత ఢిల్లీ పోలీసులకు ఉందని పేర్కొన్న అమిత్ షా 1950లో అప్పటి హోం మంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. నాడు పటేల్ ఆకాంక్షించినట్టుగానే అదే స్ఫూర్తితో ఢిల్లీ పోలీసులు పనిచేస్తున్నారని తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం, పర్వదినాలు, విదేశీ ప్రముఖుల రాక సమయాల్లో శాంతిభద్రతల పరిరక్షణలో ఢిల్లీ పోలీసులు నిరుపమాన పాత్ర వహిస్తున్నారని అమిత్ షా తెలిపారు. విధి నిర్వహణలో ఇప్పటివరకు 35వేల మంది పోలీసులు మరణించారని గుర్తు చేసిన అమిత్ షా 2001లో పార్లమెంటుపై జరిగిన దాడి సమయంలో మరణించిన ఐదుగురు ఢిల్లీ పోలీసు సిబ్బందికి నివాళులు అర్పించారు.
*చిత్రం...ఢిల్లీ పోలీస్ 73వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం గౌరవ వందనం స్వీకరిస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా