జాతీయ వార్తలు

గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డామన్: దేశంలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం అనేక చర్యలు తీసుకుంటోందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వెల్లడించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించేందుకు ఎన్‌డీఏ సర్కార్ పలు కార్యక్రమాలు తీసుకుందని ఆయన స్పష్టం చేశారు. వ్యవసాయం రంగం అభివృద్ధికి 25 లక్షల కోట్ల రూపాయలు కేంద్రం ఖర్చుచేస్తోందని కోవింద్ తెలిపారు. కేంద్ర పాలిత ప్రాంతమైన దాద్రా, నాగర్ హవేలీ, డామన్, డయిలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు రాష్టప్రతి శంకుస్థాపన చేశారు. రీమోట్ కంట్రోల్ ద్వారా పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర పాలిత ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ప్రకటించారు. గత ఏడాది డిసెంబర్‌లో దీనికి సంబంధించి పార్లమెంట్‌లో బిల్లు ఆమోదించారని ఆయన గుర్తుచేశారు. రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో అభివృద్ధి పనులు షరవేగంగా పూర్తిచేయడానికి కేంద్రం చర్యలు తీసుకుందని కోవింద్ అన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసేందుకు అనేక చర్యలు తీసుకున్నట్టు రాష్టప్రతి తెలిపారు. ఇటీవలే 25 లక్షల కోట్ల రూపాయలతో చేపట్టే కార్యక్రమాలను కేంద్రం ప్రకటించిందని ఆయన స్పష్టం చేశారు. ‘అనేక ప్రాజెక్టులు ప్రకటించారు. పీఎం కిసాన్ నిధి, గిర్ ఆదర్శ్ అజ్విక్ యోజన, రైతులకు విత్తనాలు, యంత్రాలు కొనుగోలుకు 50 శాతం సబ్సిడీ ఇస్తోంది. తద్వారా రైతుల ఆదారం రెట్టింపుచేయడానికి ఎన్‌డీఏ కృషి చేస్తోంది’అని రాష్టప్రతి పేర్కొన్నారు. ఇటీవలే విలీనమైన కేంద్ర పాలిత ప్రాంతానికి ఆయన ఏడు కొత్త ఆరోగ్య కేంద్రాలకు శంకుస్థాపన చేశారు. డామన్ జెట్టీ, దభేల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, జాంపోర్ బీచ్ ఆధునీకరణ, దాద్రా-నాగర్ హైవేలీలో రెండు ఉన్నత శ్రేణి బ్రిడ్జిలకు రాష్ట్రపతి ప్రారంభోత్సవం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పరిశుభ్రమైన మంచి నీరు సరఫరా, మహిళల భద్రత కల్పన వంటి సవాళ్లు ఇప్పటికీ ఎదుర్కొంటున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒక రోజు పర్యటనకు విచ్చేసిన కోవింద్ దాద్రా-నాగర్ హైవేలీలో సమగ్ర మంచి నీటి పథకానికి ప్రారంభోత్సవం చేశారు. న్యూ గార్డెన్, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు ప్రారంభం చేసిన తరువాత రాష్ట్రపతి మాట్లాడుతూ ‘ ఈ పథకం వల్ల మరింత మంది పర్యాటకులు సందర్శనకు వీలుంటుంది. భవిష్యత్‌లో ఈ ప్రాంతం ఓ పర్యాటక కేంద్రంగా ఆవిర్భవిస్తుంది’అని ప్రకటించారు. సిల్వాసాలోని వినోబాభావే సివిల్ ఆసుపత్రి 650 పడకలతో నడుస్తోందని ఆయన అన్నారు. డామన్‌లో త్వరలోనే 300 పడకల ఆసుపత్రి ఏర్పాటవుతోందని ఆయన చెప్పారు. ఎంపీ స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం కింద 30 ఆరోగ్య కేంద్రాలను ఆధునీకరించనున్నట్టు ఆయన స్పష్టం చేశారు. డామన్‌లోని పాఠశాలల్లో బాలికల వంద శాతం హాజరుపై రాష్ట్రపతి హర్షం వ్యక్తం చేశారు.‘విద్య అందరికీ అందాలన్న రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ కలలను నిజం చేయడానికి మీరు చేస్తున్న కృషి గొప్పది’అని కోవింద్ ప్రశంసించారు. సాయంత్రం జాంపోర్ సీ ఫోర్ట్ రోడ్డును రాష్టప్రతి ప్రారంభించారు. మోతీ డామన్ జెట్టీ నుంచి జాంపోర్ బీచ్ వరకూ రహదారి సౌకర్యం ఉంటుంది. అదే ప్రాంతంలో ఆయుష్మాన్ భారత్ వెల్‌నెస్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. సిల్వాసాలో పట్టణంలో సాంస్కృతి కార్యక్రమాలను ఆయన తిలకించారు. రాత్రి ఇక్కడే బస చేసిన రాష్ట్రపతి మంగళవారం ఉదయం రాజధాని ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు.

*చిత్రం... సభలో మాట్లాడుతున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్