క్రైమ్/లీగల్

సైనికాధికారిణులకు ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: సైన్యంలో మహిళా అధికారులకు పోరాట పదవులు మినహా మిగతా అన్ని యూనిట్లలో శాశ్వత కమిషన్ ఇవ్వటంతోపాటు కమాండ్ పోస్టింగ్‌లలో నియమించాలని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సైన్యంలో మహిళలకు శాశ్వత కమీషన్ ఇవ్వాలంటూ పది సంవత్సరాల క్రితం ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు సమర్థించింది. శాశ్వత కమిషన్ కోసం మహిళా అధికారులు మూడు నెలల లోగా దరఖాస్తులు పెట్టుకోవాలని సుప్రీం కోర్టు తన ఆదేశంలో సూచించింది. మహిళల దుర్భలత్వం మూలంగా వారికి కమాండ్ పోస్టింగ్‌లు ఇవ్వటం సాధ్యం కాదన్న కేంద్ర ప్రభుత్వం వాదనను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. మహిళా సైనికాధికారులకు కమాండ్ పోస్టింగ్‌లు ఇవ్వటంపై ఎలాంటి నిషేధం ఉండరాదని ధర్మాసనం స్పష్టం చేసింది. న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నాయకత్వంలోని సుప్రీం కోర్టు బెంచ్ సోమవారం ఈ తీర్పు ఇస్తూ ‘శారీరక పరిమితులు, సామాజిక కట్టుబాట్ల మూలంగా మహిళలకు శాశ్వత కమిషన్, కమాండ్ పోస్టింగ్‌లు ఇవ్వటం సాధ్యం కాదన్న కేంద్ర ప్రభుత్వం వాదన ఆందోళన కలిగిస్తోంది‘అని కీలక వ్యాఖ్యలు చేసింది. సైన్యంలో మహిళలకు కమాండ్ పోస్టింగ్‌లు ఇవ్వటంపై నిషేధం విధించటం హేతుబద్ధం కాదు, సమానత్వం హక్కుకు వ్యతిరేకమని ధర్మాసనం పేర్కొంది. సైన్యంలోని మహిళా అధికారులు కమాండ్ పోస్టింగ్‌లకు అర్హులేనని కోర్టు స్పష్టం చేసింది. గతంలో మహిళాధికారులు దేశానికి మంచి పేరు తెచ్చారంటూ సైన్యంలో లింగ వివక్షను చరమగీతం పాడేందుకు కేంద్ర ప్రభుత్వం ఆలోచనా విధాన మారాలని సుప్రీం కోర్టు సూచించింది. సైన్యంలోని మహిళా అధికారులకు శాశ్వత కమీషన్ ఇవ్వాలంటూ 2010లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎలాంటి స్టే లేకున్నా కేంద్ర ప్రభుత్వం ఈ తీర్పును అమలు చేసేందుకు గత పది సంవత్సరాల్లో ఎలాంటి చర్యలు తీసుకోలేదని కోర్టు మండిపడింది. మహిళలకు కమాండ్ పోస్టింగ్‌లు ఇవ్వకపోవడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కు విరుద్ధమని కోర్టు తెలిపింది. మహిళల శక్తియుక్తులు, సైన్యంలో వారు సాధించిన విజయాలపై అనుమానాలు వ్యక్తం చేయటం మహిళలతో పాటు సైన్యాన్ని అవమానించటమేనని కోర్టు అభిప్రాయపడింది. బబితాపునియా, ఇతరులు కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శిపై దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తులు చంద్రచూడ్, అజయ్ రస్తోగి ఈ తీర్పు ఇచ్చారు. మహిళాధికారులకు శారీరిక అసమానతలు, గృహ సంబంధ బాధ్యతల మూలంగా కమాండ్ పోస్టింగ్‌లు ఇవ్వటం సాధ్యం కాదన్న కేంద్ర ప్రభుత్వం వాదన మగవాళ్ల ఆధిపత్యాన్ని కొనసాగించేదిగా ఉందని జస్టిస్ చంద్రచూడ్ కేంద్ర ప్రభుత్వానికి చురకలు వేశారు. పద్నాలుగు సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ ఏళ్లు సర్వీసు చేసిన మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ ఇవ్వటం సాధ్యం కాదన్న కేంద్ర ప్రభుత్వం వాదన న్యాయాన్ని అవహేళన చేసేదిగా ఉన్నదని ఆయన అన్నారు. గ్రామీణ ప్రాంతాల నేపథ్యం ఉన్న క్షేత్ర స్థాయి సైనికులు మహిళాధికారుల నాయత్వాన్ని అంగీకరించకపోవచ్చునన్న కేంద్ర ప్రభుత్వం వాదనను కూడా సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. కమాండ్ పోస్టింగ్‌లు తిరస్కరించేందుకు ఇదేమి కారణమని కోర్టు ప్రశ్నించింది.