జాతీయ వార్తలు

2020 నాటికి లెవెల్ క్రాసింగ్‌లకు ‘కాపలా’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: కాపలా లేని లెవెల్ క్రాసింగ్‌లు పూర్తిగా తొలగించడానికి రైల్వేశాఖ కసరత్తు చేస్తోంది. 2020 మార్చి 31 నాటికి దేశంలో ఎక్కడా కాపలాలేని లెవెల్ క్రాసింగ్‌లు లేకుండా ఉండేందుకు చర్యలు తీసుకునేందుకు సమాయత్తమైంది. ఉత్తరప్రదేశ్‌లో గురువారం నాడు కాపలాలేని లెవెల్‌క్రాసింగ్ వద్ద ఓ స్కూల్‌వ్యాన్‌ను రైలు ఢీకొన్న దుర్ఘటనలో 13 మంది చిన్నారులు మృతిచెందారు. తరచూ దేశంలో ఏదో చోట ఇలాంటి దుర్ఘటనలు చోటుచేసుకుంటునే ఉన్నాయి. యూపీ ప్రమాదాన్ని తీవ్రంగా పరిగణించిన రైల్వేశాఖ 2020 నాటికి ఎక్కడా కాపలా లేని లెవెల్ క్రాసింగ్‌లు ఉండకూడదని నిర్ణయించింది. ఈ మేరకు రైల్వే బోర్టు చైర్మన్ అశ్వనీ లోహానీ ఓ ప్రకటన చేస్తూ లెవెల్ క్రాసింగ్‌లు దాటే సమయంలో ప్రజలు పూర్తి అప్రమత్తంగా ఉండాలని కోరారు. కాపలాలేని లెవెల్ క్రాసింగ్ వద్ద ప్రమాదాలు నివారించాలంటే ప్రజల అప్రమత్తత కూడా ఎంతో అవసరమని ఆయన అన్నారు. ‘కాపలాలేని లెవెల్ క్రాసింగ్‌లు తొలగించేందుకు ప్రయత్నిస్తున్నాం. 2020 నాటికి అది పూర్తవుతుంది’ అని లోహానీ వెల్లడించారు. యూపీలో స్కూల్ వ్యాన్‌ను ప్యాసింజర్ రైలు ఢీకొన్న ఘటనతో 13 మంది చిన్నారులు మృతి చెందారు. 8-10 ఏళ్ల మధ్యవయస్కులైన చిన్నారులు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందారు. వ్యాన్ డ్రైవర్‌తోపాటు ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. కాపలాలేని లెవెల్ క్రాసింగ్‌లనే కాదు రైలుపట్టాలు దాటే సమయంలో ఎంతోఅప్రమత్తతతో ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘ప్రమాదాల నుంచి బయటపడడానికి అదొక్కటే ప్రత్యామ్నాయం. అంతకంటే రైల్వేశాఖ ఏం చేయలేదు. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉండకూడదు. హెచ్చరిక బోర్డులను గమనిస్తూ.. అత్యంత జాగ్రత్తగా ఉండాలి’ అని ఆయన మరీమరీ విజ్ఞప్తి చేశారు. అక్కడికీ రద్దీగా ఉన్న ప్రాంతాల్లోని లెవెల్‌క్రాసింగ్‌లు తొలగిస్తునే ఉన్నామని, ఈ ఏడాది మార్చి 31 నాటికి అది పూర్తవుతుందని లోహానీ స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా 5,792 లెవెల్ క్రాసింగ్‌లున్నట్టు రైల్వే గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రజలు లెవెల్‌క్రాసింగ్‌లు దాటకుండా ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం, సబ్‌వేల ఏర్పాటు జరుగుతోంది. 2016-17 సంవత్సరానికి 1354 ఓవర్ బ్రిడ్జిలు/సబ్‌వేల నిర్మాణం జరిగింది. 2018-19 సంవత్సరానికి 1600 నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అన్‌మేన్డ్ లెవెల్ క్రాసింగ్ (యూఎంఎల్‌సీ) వద్ద పాదచారులు, వాహన దారులే జాగ్రత్తగా ఉండాలి. రైల్వే శాఖకు ఎలాంటి బాధ్యతా ఉండదు. హెచ్చరిక బోర్డులు ఇరువైపులా ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం ఒక్కటే చేయగలరు. యూఎంఎల్‌సీ దాటే సమయంలో ఆగి అటు ఇటూ ఏమైనా రైళ్లు వస్తున్నాయా లేదా అన్నది గమనించిన తరువాతే పట్టాలు దాటాలని నిబంధనలున్నాయి. అయితే చాలా సందర్భాల్లో నిర్లక్ష్యంగా ఉండి నిండుప్రాణాలు బలితీసుకుంటున్నారు. వ్యాన్ డ్రైవర్ అజాగ్రత్తవల్లే గురువారం ప్రమాదం జరిగింది. వ్యాన్ ఆపకుండా వెళ్లిపోవడంతో 13 మంది చిన్నారుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.