జాతీయ వార్తలు

షాహిన్‌బాగ్ సందర్శించిన కోర్టు మధ్యవర్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: భారతీయ పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన షాహీన్‌బాగ్ ప్రాంతాన్ని సుప్రీం కోర్టు మధ్యవర్తుల బృందం సందర్శించింది. న్యూఢిల్లీలోని షాహీన్‌బాగ్ వద్ద సుమారు రెండు నెలలుగా నిరసనకారులు రోడ్డు దిగ్బంధం చేసిన సంగతి తెలిసిందే. రోడ్డు దిగ్బంధం చేయడం వల్ల ప్రయాణికులకు కలుగుతున్న అసౌకర్యం కలుగుతున్నదంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీంతో కోర్టు నిరసనకారులను రోడ్డు దిగ్బంధం చేసి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించరాదని సూచించింది. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపేందుకు ప్రజలకు రాజ్యాంగంలో ప్రాథమిక హక్కు కల్పించిచనట్లు కోర్టు పేర్కొంది. అయితే అంత మాత్రాన నిరసనకారులు రోడ్డు దిగ్బంధం చేసి ఇతరులకు అసౌకర్యం కల్పంచడం భావ్యం కాదని తెలిపింది. నిరసనకారులు ప్రత్యామ్నాయ స్థలాన్ని చూసుకోవాల్సిందిగా కోర్టు సూచించింది. కోర్టు నియమించిన మధ్యవర్తుల బృందం సభ్యులు సంజయ్ హెగ్డె, సాధన రామచంద్రన్ మీడియాతో మాట్లాడుతూ ఇక్కడ గుమిగూడిన వారి అభిప్రాయాలు తెలుసుకోవడం జరిగిందన్నారు.