జాతీయ వార్తలు

బీజేపీది గురువింద ధోరణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అకోలా, ఏప్రిల్ 26: కర్నాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిమయం అంటూ విమర్శలు గుప్పిస్తున్న బీజేపీ నాయకత్వం రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కళంకితులకే టిక్కెట్లు ఇచ్చిందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. సిద్ధరామయ్య ప్రభుత్వంపై మోదీ తాజాగా చేసిన విమర్శలను తిప్పికొట్టిన రాహుల్ గాంధీ ఎనిమిది మంది కళంకిత అభ్యర్థులు బీజేపీ ఏ విధంగా టిక్కెట్లు ఇస్తుందని గురువారం ఇక్కడ జరిగిన ప్రచారంలో రాహుల్ ధ్వజమెత్తారు. అవినీతి గురించి మాట్లాడే అర్హత మోదీకి ఏముందని ప్రశ్నించిన రాహుల్, బీజేపీ నేతలు కూడా తీవ్రస్థాయిలో ఆర్థిక అక్రమాలకు పాల్పడుతున్నారని అన్నారు. ‘మోదీ తరచూ అవినీతి గురించి మాట్లాడతారు. దాన్ని అంతం చేస్తానంటారు. 30వేల కోట్ల రూపాయలు ఎగవేసి దేశం వదిలి పారిపోయిన ఆర్థిక నేరగాళ్ల గురించి నోరువిప్పరు’ అని రాహుల్ అన్నారు. మోదీ వేదిక ఎక్కితే ఆయనకు ఓ వైపు నుంచునే యెడ్యురప్ప అవినీతి ఆరోపణలపై జైలు శిక్ష అనుభవించారని, మరోవైపు నుంచునే నాయకులు కూడా జైలుకెళ్లి వచ్చినవారేనని రాహుల్ ఎద్దేవా చేశారు. అవినీతి కేసుల్లో జైలు శిక్ష అనుభవించిన వారిని తనకు ఇరువైపులా నుంచోబెట్టుకునే మోదీ అధికారంలోకి వస్తే అవినీతిని అంతం చేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. గురువారం ఇక్కడ జరిగిన రోడ్ షోలో మాట్లాడిన రాహుల్- అధికారంలో ఉన్నప్పుడు యెడ్యూరప్ప, బళ్లారి రెడ్డి సోదరులు రాష్ట్రాన్ని దోచేసుకున్నారని, కాని తమ ప్రభుత్వం వీరి చర్యలను అరికట్టిందని వెల్లడించారు. కాని అలాంటి కళంకితులకు టిక్కెట్లు ఇవ్వడం ద్వారా వారిని ఏకంగా అసెంబ్లీకే పంపాలని మోదీ భావించడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఇలా చేయడం అన్నది నిజాయితీగా ఉండే ప్రతి పౌరుడికీ అవమానమని రాహుల్ అన్నారు.