జాతీయ వార్తలు

స్కూళ్లలో ‘నో బ్యాగ్ డే’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, ఫిబ్రవరి 20: రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం రైంతాంగ సమస్యకే అధిక ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. 100 కోట్లతో ‘ఆరోగ్య బడ్జెట్’ను ప్రకటించింది. ఆరోగ్య సంరక్షణకుకు నిధులు ఖర్చు చేస్తారు. కల్తీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తారు. అలాగే శనివారాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ‘నో బ్యాగ్ డే’గా పాటించాలని విజ్ఞప్తి చేశారు. గురువారం రాజస్థాన్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ బడ్జెట్‌పై మాట్లాడుతూ ప్రజలపై ఎలాంటి కొత్త పన్నులు వేయలేదని ప్రకటించారు. ఆర్థిక మంత్రిగా కూడా గెహ్లాట్ అదనపుబాధ్యతలు చూస్తున్నారు. కొత్త పన్నులు లేకపోగా రైతులకు భూ పట్టాకు స్టాంప్ డ్యూటీ వెసులుబాటు కల్పించారు. స్టాంప్ డ్యూటీ మినహాయింపుఇచ్చారు. రూ. 1,73,404.42 కోట్ల రూపాయలతో అంచనా బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆర్థిక వ్యయం రూ, 1,85,750.03గా చూపించారు. రెవిన్యూ లోటు రూ. 12,345.61 కోట్ల రూపాయలు. బడ్జెట్‌లో ఏడు అంశాలకు ప్రాధాన్యత ఇచ్చిటనట్టు ముఖ్యమంత్రి తెలిపారు. రైతులు, మహిళలు, శిశు సంక్షేమం, విద్య రంగాలకు కేటాయింపులు ఎక్కువ అని ఆయన చెప్పారు. అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం తమ ప్రభుత్వం పాటుపడుతోందని, దానికి అనుగుణంగానే బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయని గెహ్లాట్ ప్రకటించారు. పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ‘వన్-స్టాప్ షాప్’ విధానాన్ని సీఎం ప్రకటించారు. బాలల హక్కుల పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్న గెహ్లాట్ ‘నెహ్రూ చైల్డ్ ప్రొటెక్షన్ ఫండ్’ను ప్రకటించారు. మహిళలు, చిన్నారులు, కార్మికుల అక్రమ రవాణాను అడ్డుకుంటామని ఆయన చెప్పారు. కల్తీలపై కఠినంగా ఉంటామని, అలాంటి కేసుల పరిష్కారానికి ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నట్టు బడ్జెట్ ప్రసంగంలో ఆయన చెప్పారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి అనేక పథకాలు ప్రకటించారు. జిల్లా, తాలూకా స్థాయి క్రీడా పోటీలు నిర్వహిస్తారు. అలాగే విజేతలకు ఇచ్చే నగదు బహుమతులను రెట్టింపుచేశారు. ఒలింపిక్స్, ఆసియా, కామనె్వల్త్ క్రీడల్లో పతకాలు సాధించేవారికి నగదు పురస్కారం పెంచారు. అంతర్జాతీయ స్థాయిలో తర్ఫీదు ఇవ్వడానికి 500 మంది కోచ్‌లను నియమించనున్నారు. ఒలింపిక్ బంగారు పతకం విజేతకు నగదు పురస్కారం 75 లక్షల రూపాయల నుంచి మూడు కోట్లకు వెండి పతకంకు 50 లక్షల నుంచి రెండు కోట్లకు, కాంశ్య పతకానికి 30 లక్షల నుంచి కోటి రూపాయలకు నగదు బహుమతి పెంచారు. ఆసియా, కామనె్వల్త్ క్రీడా విజేతలకు పారితోషిగా భారీగా పెంచారు. ప్రభుత్వ పాఠశాలల్లో శనివారం ‘నో బ్యాగ్ డే’గా పాటించాలని సీఎం పిలుపునిచ్చారు. వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలు, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, స్కౌట్ వంటివి నిర్వహించాలని ఆయన ఆదేశించారు. అదే రోజు తల్లిదండ్రులు- ఉపాధ్యాయుల సమావేశాలు కచ్చితంగా నిర్వహించాలన్నారు. రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులకు ప్రైవేటు ఆసుపత్రుల్లో కచ్చితంగా వైద్యం అందించాలని అలా జరగని పక్షంలో సంబంధిత యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది. తమిళనాడు తరహాలో రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రమాదాలకు ఆస్కారం ఉన్న ప్రాంతాలను గుర్తించి పరిస్థితిని సమీక్షించేందుకు రోడ్ మ్యాప్‌ను రూపొందించనున్నట్టు గెహ్లాట్ ప్రకటించారు. మూడు జిల్లాలకు చీఫ్ మినిస్టర్ రోడ్ సెఫ్టీ బహుమతిని ఆయన వెల్లడించారు.