జాతీయ వార్తలు

పంటల బీమా ప్రీమియంపై రైతులను మోసం చేసిన సర్కార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,్ఫబ్రవరి 20: పీఎం పంటల బీమా, వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రీమియం మొత్తాన్ని నూటికి నూరు శాతం తగ్గించటం ద్వారా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రైతులను మోసం చేశారని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రఇదీప్‌సింగ్ సుర్జేవాలా ఆరోపించారు. గురువారం నాడిక్కడ ఏఐసీసీ కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోదీ 2016లో అట్టహాసంగా ప్రకటింటిన పీఎం పంటల బీమా పథకానికి తాళం వేస్తున్నారని ఆరోపించారు. ‘ఈ బీమా పథకంలో రైతులు రెండు శాతం ప్రీమియం చెల్లిస్తే కేంద్ర ప్రభుత్వం యాభై శాతం, మిగతా ప్రీమియంను రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించేవని, మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న తుగ్లక్ నిర్ణయం ప్రకారం కేంద్రం చెల్లించే ప్రీమియమ్‌ను యాభై నుంచి ఇరవై ఐదు శాతానికి తగ్గించారు, అంటే నూరు శాతం కోత విధించార’ని సుర్జేవాలా ఆరోపించారు. మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు రైతు ఇక మీదట పంట బీమా కోసం ఇరవై ఏడు శాతం ప్రీమియం చెల్లించవలసి ఉంటుంది, రైతు ఇంత ప్రీమియం చెల్లించగలడా? అని ఆయన ప్రశ్నించారు. మారిన పరిస్థితిలో రైతు తన పంటను బీమా చేయించలేడని సుర్జేవాలా తెలిపారు. రబీ పంటకు రెండున్నర శాతం, ఖరీఫ్ రెండు శాతం ప్రీమియం మాత్రమే రైతుల నుండి వసూలు చేస్తామంటూ 2016లో మధ్యప్రదేశ్‌లో చేసిన ప్రకటనను మోదీ మరిచిపోయారా? అని ఆయన నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం తన వంతు ప్రీమియం చెల్లించనప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రీమియం చెల్లించేలా ఎవరు చేస్తారు? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వాలు తమ వంతు ప్రీమియం చెల్లించకపోతే రైతులపై మొత్తం బీమా ప్రీమియం భారం పడుతుంది, ఇంత భారాన్ని రైతు మోయగలడా? అని సుర్జేవాలా అడిగారు. రాష్ట్ర ప్రభుత్వాలు తమ వంతు ప్రీమియం చెల్లించకలేతో ఆ ప్రాంతంలో పంటల బీమా పథకాన్ని రద్దు చేయాలంటూ కేంద్రం నిన్న తీసుకున్న నిర్ణయం తుగ్లక్ నిర్ణయం కాదా? అని సుర్జేవాలా ప్రశ్నించారు. మోదీ ప్రవేశపెట్టిన పీఎం పంట బీమా పథకం మూలంగా ప్రైవేట్ బీమా కంపెనీలకు లాభం కలిగించింది తప్ప రైతులకు ప్రయోజనం కలగలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇంత వరకు పంటల బీమా పథకానికి 77801 కోట్ల ప్రీమియం చెల్లిస్తే బీమా కంపెనీలు 19202 కోట్ల లాభం సంపాదించాయని సుర్జేవాలా వెళ్లడించారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించే పక్షంలో రైతులను ఇక మీదట ఎవరు ఆదుకుంటారని ఆయన ప్రశ్నించారు. పీఎం పంటల బీమా పథకాన్ని మూసి వేసేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. పంటల బీమా పథకం లేకపోతే రైతులను ఎవరు ఆదుకుంటారు? ఎలా ఆదుకుంటారు? అన్నదాత కడుపుపై తన్నటం మంచిదా? అని ఆయన మోదీ ప్రభుత్వాన్ని సుర్జేవాలా నిలదీశారు. కాంగ్రెస్‌కు కొత్త అద్యక్షుడిని ఎన్నుకునేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలన్న శశిథరూర్ డిమాండ్ గురించి అడుగగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ద్వారానే సోనియా గాంధీ అధ్యక్ష పదవికి ఎన్నికైన విషయాన్ని మరిచిపోవద్దని సుర్జేవాలా బదులిచ్చారు. సందీప్ దీక్షిత్ ట్వీట్ల గురించి అడుగగా ‘ఆయన తన నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి కృషి చేసిఉంటే బాగుండేద’ని సుర్జేవాలా సూచించారు.