జాతీయ వార్తలు

దేశాభివృద్ధికి పనిచేద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: క్షేత్ర స్థాయిలో పనిచేయటం ద్వారా దేశాభివృద్ధికి కృషి చేయాలని జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ విద్యార్థులకు పిలుపు ఇచ్చారు. దేశ రాజధాని ఢిల్లీలోని విజాన్ భవన్‌లో గురువారం జరిగిన ‘్భరతీయ ఛాత్ర సంసద్’ (్భరతీయ విద్యార్థుల పార్లమెంటు)లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన విద్యార్థులు, యువతను ఉద్దేశించి మాట్లాడుతూ మీరంతా దేశంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చినా ఒక దేశం, ఒక ఇండియా మూలంగా ఇక్కడ మనమంతా ఒకటేననే భావం కలుగుతోందని ఆయన చెప్పారు. కేవలం విజానాన్ని పొందేబదులు క్షేత్ర స్థాయిలో పనిచేయటం ద్వారా దేశాభివృద్ధికి తోడ్పడాలని ఆయన విద్యార్థులు, యువతకు హితవు పలికారు. ‘మీ దేశం, మీ హక్కుల కోసం లేచి నిలబడితే మిమ్మల్ని ఏ ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చేయలేద’ని ఆయన సదస్సుకు హాజరైన విద్యార్థులు, యువతకు స్పష్టం చేశారు. అపజయం ఎదురైనంత మాత్రాన పరువు, ప్రతిష్టకు భంగం వాటిల్లిందని భావించవద్దు, మీరు నిజంగానే ఈ దేశాన్ని ప్రేమిస్తే దేశాభివృద్ధి కోసం కృషి చేయకుండా మిమ్మల్ని ఏ శక్తీ ఆపలేదని పవన్ కళ్యాణ్ చెప్పారు. స్వాతంత్య్ర సమర యోధుల జీవిత చరిత్రలను చదవటం ద్వారా
ప్రజలు పడుతున్న కష్టాల గురించి తెలుసుకుని చాలా బాధపడ్డానని పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రజలు పడుతున్న కష్టాల గురించి తెలుసుకున్న తరువాతనే దేశానికి ఏమైనా చేయాలనే తపన తనలోప్రారంభమైందని ఆయన వెల్లడించారు. పవన్‌కళ్యాణ్ అంతకు ముందు సైనిక్ బోర్డు కార్యాలయానికి వెళ్లి సైనికుల సంక్షేమం కోసం ఒక కోటి రూపాయల చెక్‌ను బోర్డు కార్యదర్శికి అందజేశారు. మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తూనే ఉంటానని ఆయన హామీ ఇచ్చారు.

*చిత్రం... ఢిల్లీలోని కేంద్రీయ సైనిక్ బోర్డుకు కోటి రూపాయల చెక్కు అందజేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్