జాతీయ వార్తలు

తేడా వస్తే కేసు బదిలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి రేకెత్తించిన కథువా అత్యాచార కేసు విచారణకు సంబంధించి సుప్రీంకోర్టు తీవ్ర స్వరంతో హెచ్చరికలు జారీచేసింది. సామూహిక మానభంగం, హత్యకు సంబంధించిన ఈ కేసు విచారణలో ఎలాంటి లోపం ఉండటానికి వీల్లేదని, ఇందుకు సంబంధించి ఏమాత్రం లేశప్రాయంగా తేడా వచ్చినా కేసు విచారణను స్థానిక కోర్టునుంచి బదలాయిస్తామని స్పష్టం చేసింది. సరైన రీతిలో ప్రాసిక్యూషన్ నిర్వహిస్తేనే ఈ కేసులో నిజానిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుందని అందుకు నిస్పాక్షికంగా, నిస్సంశయంగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు తెలిపింది.
ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా సారథ్యంలోని సుప్రీం కోర్టు బెంచ్ ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. ఇంతకుముందు భారత బార్ కౌన్సిల్ రూపొందించిన నివేదికను సుప్రీంకోర్టు పరిశీలించింది. కేసు విచారణ నిస్పాక్షికంగా జరగాలన్న విషయంలో ఎలాంటి రాజీ లేదని, ఇటు నిందితులు అటు బాధితుల తరపు వాదనలను పూర్తిస్థాయిలో విని నిజానిజాలను నిగ్గు తేల్చాలని తెలిపింది. ‘అడ్వకేట్లు తప్పుచేస్తే వారిని చట్టప్రకారం శిక్షించి తీరుతాం’ అని తేల్చిచెప్పింది. రాజ్యాంగం ప్రకారం ఇటు బాధిత కుటుంబానికి, అటు నిందితులకు సరైన న్యాయసహాయం అందించడం, విచారణను నిస్పాక్షికంగా జరపడం ఎంతైనా అవసరమని తెలిపింది.