జాతీయ వార్తలు

‘భారత ఆర్మీలో లింగ వివక్షకు తావులేదు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: లింగ వివక్షను పారద్రోలి స్ర్తి, పురుష సమానత్వం కోసం మరింతగా పోరాడాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నారావనే గురువారం నాడిక్కడ పిలుపునిచ్చారు. మహిళా అధికారుల కోసం ఒక పర్మనెంట్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తాజా తీర్పుతో ఈ విషయంలో మరింత స్పష్టత నెలకొందన్నారు. ఆర్మీలో పనిచేసే మహిళా అధికారిణుల కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయడంతోబాటు వారికి కమాండింగ్ పోస్టింగ్స్ కూడా ఇవ్వాలని గత సోమవారం సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిందని ఆయన విలేఖరులతో మాట్లాడుతూ గుర్తు చేశారు. ‘భారత సైనిక దళాల్లో ఏ ఒక్క సైనికుడు, లేదా సైనికురాలిపైనా మతం, కులం, లింగ పరమైన వివక్ష లేద’ని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ‘ఈ దృక్పథంతోనే 1993 నుంచి సైనిక దళాల్లోకి మహిళా అధికారిణులను నియమించుకోవడం జరుగుతోంద’న్నారు. ర్యాంక్, ఫైల్ విభాగాల్లో సైతం మహిళలను నియమించుకోవడం ఆరంభమైందని, ఇందులో భాగంగా తొలి 100 మంది మహిళా సైనికులతో కూడిన బ్యాచ్‌కు ‘కార్ప్స్ ఆఫ్ మిలటరీ పోలీస్ సెంటర్ అండ్ స్కూల్’లో శిక్షణ కార్యక్రమం జరుగుతోందన్నారు. కాగా సుప్రీం కోర్టు తాజా ఆదేశాలతో కూడిన తీర్పును స్వాగతిస్తున్నామని, ఇందువల్ల ఉద్యోగులకు, అధికారులకు చేకూరే ప్రయోజనాలపై స్పష్టత నెలకొనడంతోబాటు సంస్థలో మరింత సమర్థత నెలకొంటుందని జనరల్ నారావనే పేర్కొన్నారు. దేశానికి విశిష్ట సేవలందిస్తున్న ఆర్మీలోని మహిళలకు వారి కెరీర్‌ను మెరుగుపరచుకునే విషయంలో సమాన అవకాశాలు అందుతాయని తాను హామీ ఇస్తున్నానన్నారు. ఇప్పటికే పర్మనెంట్ కమిషనింగ్ విషయంలో అభిప్రాయాలు తెలియజేయాల్సిందిగా మహిళా అధికారులందరికీ లేఖలు పంపామన్నారు.
కాశ్మీరీ ఉగ్రవాదంపై ఉక్కుపాదం
జమూ-కాశ్మీర్‌లో ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపామని, తద్వారా ఆక్కడ ఈ కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయని జనరల్ నారావనే ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. అలాగే సరిహద్దు ప్రాంతాల్లో ఈ విషయంలో మరింతగా నిశిత దృష్టిని నిలిపామని, ప్రస్తుతం జరుగుతున్న ‘ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ఫోర్స్ (ఎఫ్‌ఏటీఎఫ్) ప్లీనరీలో ఈ విషయంపై చర్చ జరుగుతోందన్నారు. చైనాలాగే భారత్‌తో సంబంధాలపై పాకిస్తాన్ సైతం తన వ్యూహాన్ని సానుకూలంగా మార్చుకోవాలని సూచించారు.

*చిత్రం... ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నారావనే