జాతీయ వార్తలు

ట్రంప్ చేతికి ఆగ్రా ‘కీ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: దేశంలో ట్రంప్ పర్యటన కోలాహలం మొదలైంది. ఆదివారం నుంచి ప్రారంభం కానున్న ఆయన పర్యటనకు అన్ని వర్గాల నుంచి ఎంతో ఆసక్తి వ్యక్తమవుతోంది. సోమవారం ఆయన ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను సందర్శించనున్న దృష్ట్యా ట్రంప్‌కు స్వాగతం పలికేందుకు ఆగ్రా మేయర్ నదీమ్ కే జైన్ ప్రథమ పౌరుడిగా సిద్ధమవుతున్నారు. ‘వెండితో తయారు చేసిన ఆగ్రా నగర తాళం చెవి’ని ట్రంప్‌కు ఆయన అందించనున్నారు. విదేశీ అతిధులు ఎప్పుడు ఆగ్రా వచ్చినా వారికి నగర తాళం చెవులను అందించి ఘన స్వాగతం పలకడం అన్నది ఆనవాయితీ. విమానాశ్రయంలోనే ఈ అతిధులకు తాళం చెవిని అందిస్తామని, దీని అర్థం నగర ద్వారాలు తెరిచి ప్రవేశించాలని నదీమ్ జైన్ తెలిపారు. 600 గ్రాముల బరువు ఉండే ఈ తాళం చెవిని ఢిల్లీలో తయారు చేశారు. దీని ఆకృతి తాజ్ ఆకృతిని పోలి ఉంటుంది. డొనాల్డ్ ట్రంప్‌కు అనూహ్యమైన రీతిలోనే ఆగ్రాలో స్వాగతం లభిస్తుందని, భారత్, అమెరికా జెండాలతో ఆయన ప్రజలు ఆహ్వానం పలకనున్నారని జైన్ తెలిపారు. భార్య మెలానియా, కుమార్తె ఇవాంకా, ఆమె భర్త జారద్ కుషినర్‌తో కలిసి 24న ట్రంప్ ఆగ్రాను సందర్శిస్తారు.