జాతీయ వార్తలు

క్షీణించిన అడవుల పునరుద్ధరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భోపాల్, ఫిబ్రవరి 22: ‘మా రాష్ట్రంలో అటవీ సంపద అతి పెద్ద రాజధానిగా ఉంది..’ అని మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ అన్నారు. అయితే క్షీణించిన అడవులను పునరుద్ధరించడం అనేది తమ ముందు సవాల్‌గా ఉందని ఆయన తెలిపారు. పరిపాలనా అకాడమీలో శనివారం జరిగిన అటవీ సదస్సుకు ముఖ్యమంత్రి కమల్‌నాథ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ అటవీ మార్గంలో వచ్చే టెన్షన్, సంఘర్షణలను పరిష్కరించుకోవాల్సి ఉందన్నారు. అటవీ అధికారులు, అడవుల్లో నివసిస్తున్న వారు సుహృద్భావమైన వాతావరణంలో పరస్పరం చర్చించుకోవాలన్నారు. మధ్యప్రదేశ్ అతి పెద్ద రాజధాని అటవీ సంపద కావడం తమకు గర్వకారణంగా ఉందని ఆయన తెలిపారు. అయితే క్షీణించిన అడవులను పునరుద్ధరించడమే ఇప్పుడు తమ ముందు అతి పెద్ద సవాల్‌గా ఉందన్నారు. అడవులను పునరుద్ధరించే విషయంలో అధికారులు నడుం బిగించాలని ఆయన సూచించారు. ఇందుకు ప్రజలను భాగస్వామ్యం చేయాలని ఆయన సూచించారు. అడవులను పునరుద్ధరించే విషయంలో అడవుల్లో నివసించే వారికి, అధికారులకు మధ్య తలెత్తే వివాదాలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని ముఖ్యమంత్రి కమల్‌నాథ్ సూచించారు. అటవీ శాఖ ఉద్యోగులతో, ముఖ్యంగా అడవుల్లో విధులు నిర్వహిస్తున్న కింది స్థాయి సిబ్బందితో అధికారులకు సత్సంబంధాలు ఉండాలని ఆయన తెలిపారు. అటవీ చట్టాలకు అనుగుణంగానే నడుచుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. 1980లో అటవీ చట్టం చేసేప్పుడు అంత ఎక్కువగా సమస్య లేదన్నారు. రాష్ట్రంలో జీవవైవిధ్యం చాలా ఎక్కువగా ఉందని ముఖ్యమంత్రి కమల్‌నాథ్ తెలిపారు. ప్రపంచంలో రసాయనాల వినియోగం చాలా ఎక్కువగా, వేగంగా పెరుగుతున్నదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమయంలో అడవుల పెంపకం ఇంకా విస్తృతంగా చేపట్టాల్సి ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. ఇంకా ఈ సమావేశంలో మధ్యప్రదేశ్ రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఉమాంగ్ సింఘర్, అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ డాక్టర్ యు.ప్రకాశం తదితరులు ప్రసంగించారు. అదనపు ప్రధాన కార్యదర్శి (అడవులు) ఎపీ శ్రీవాత్సవ కూడా పాల్గొన్నారు.

*చిత్రం... మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్