జాతీయ వార్తలు

నెహ్రూ కృషి వల్లే భారత్‌కు ఖ్యాతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: జాజ్వల్యమైన ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఘన కీర్తులు అందుకుంటోందంటే అందుకు కారణం స్వతంత్ర భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ చేసిన కృషేనని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. భారత్‌మాతాకీ జై వంటి నినాదాలు భావోద్వేగపూరితమైనవేనని శనివారంనాడు ఇక్కడ ‘నెహ్రూ కృషి-ప్రసంగాలు’పై ఓ పుస్తకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా అన్నారు. బీజేపీతో పరోక్షంగా విమర్శలు గుప్పించిన ఆయన భారతదేశాన్ని శైశవ దశలో సారథ్యం వహించి దానిని నిరుపమానంగా తీర్చిదిద్దిన ఘనత నెహ్రూదేనని అన్నారు. ఆయన కృషి వల్లే సామాజికంగాను, ఆర్థికంగాను ఎంతో పటుత్వాన్ని భారత్ సంతరించుకోగలిగిందని మన్మోహన్ సింగ్ తెలిపారు. భారతీయ నాగరికత, సంస్కృతిని ఆకళింపు జేసుకుని నవభారత నిర్మాణ అవసరాలకు అర్థవంతమైన రీతిలో వాటిని రంగరించిన వ్యక్తి జవహర్‌లాల్ నెహ్రూ అని ఆయన తెలిపారు. నవ భారతానికి ప్రతీకలుగా నిలుస్తున్న విశ్వవిద్యాలయాలు, విద్యా కేంద్రాలు, సాంస్కృతిక వ్యవస్థలను స్థాపించిన వ్యక్తి నెహ్రూ అని పేర్కొన్న ఆయన ‘తొలి దశలో నెహ్రూ సారథ్యం లేకపోయి ఉంటే నేడు మనం చూస్తున్న భారతదేశం ఉండేదే కాదు’ అని అన్నారు. అయితే, ఈ వాస్తవాలను మరుగునపరచి నెహ్రూ ప్రతిష్టను దిగజార్చేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని, వీటికి చరిత్రను తెలుసుకునే సహనం కూడా లేదని మన్మోహన్ అన్నారు. అయితే, ఈ రకమైన తప్పుడు ప్రచారాన్ని, అన్వయింపులను చరిత్ర తిరస్కరిస్తుందని తెలిపారు. ‘్భరత్ మాత ఎవరు’ అన్న పేరుతో పురుషోత్తమ్ అగర్వాల్, రాధాకృష్ణ ఈ పుస్తం రాశారు. నెహ్రూ రాసిన పుస్తకాల నుంచి కొన్ని భాగాలు సేకరించి, వాటిని విశే్లషిస్తూ ఈ పుస్తకాన్ని రూపొందించారు.
అలాగే ఇందులో ఆయన ప్రసంగాలు, ఇంటర్వ్యూలను కూడా పొందుపరిచారు. ఓ పక్క జాతీయవాదం, మరోపక్క భారత్ మాతాకీ జై వంటి అంశాలను భావోద్వేగ రీతిలో వినియోగించుకుంటున్న నేటి తరుణంలో ఇలాంటి పుస్తకం అవసరం ఎంతో ఉందని మన్మోహన్ అన్నారు. అప్పటి రాజకీయ పరిస్థితుల్లో ఎన్నో ఒత్తిళ్లకు లోనైనప్పటికీ నిజమైన ప్రజాస్వామ్యవాదిగానే నెహ్రూ నిలబడ్డారని అన్నారు.

*చిత్రం... మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్