రాష్ట్రీయం

అభివృద్ధే బీజేపీ అజెండా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, ఏప్రిల్ 26: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మరింత ఉధృతిని సంతరించుకుంది. రంగంలోకి దిగిన ప్రధాని నరేంద్ర మోదీ అధికార కాంగ్రెస్‌పై తీప్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. కులాల ప్రాతిపదికన సమాజాన్ని చీల్చేస్తోందని, అలాగే అబద్ధాల ప్రచారంతో అధికారాన్ని అంటిపెట్టుకుని ఉండాలన్న కుత్సిత వ్యూహమే కాంగ్రెస్ లక్ష్యమని మోదీ అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే బీజేపీ ఏకైక అజెండా అని స్పష్టం చేసిన మోదీ, ‘రాష్ట్ర సమగ్ర వికాసానికి నా ప్రభుత్వం మూడెంల వ్యూహంతో ముందుకు వెళుతోంది. ఇందుకు సంబంధించి బీజేపీ నాయకత్వం కృతనిశ్చయంతో పనిచేస్తుంది’ అని తెలిపారు. తన మొబైల్ యాప్ ద్వారా రాష్ట్రానికి చెందిన పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు, కార్యవర్గ సభ్యులను ఉద్దేశించి మాట్లాడిన మోదీ ప్రస్తుత ఎన్నికల్లో పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న దానిపై దిశానిర్దేశం చేశారు. కర్నాటక సమగ్రాభివృద్ధి తప్ప తమ పార్టీకి మరో అజెండానే లేదని ఉద్ఘాటించిన మోదీ, రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందాలంటే బీజేపీని అధికారంలోకి తీసుకురావడం ఒక్కటే మార్గమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ వస్తుందన్న అంచనాలను కొట్టిపారేశారు. ఇదంతా తప్పుడు ప్రచారమేనని పేర్కొన్న ఆయన గత లోక్‌సభ ఎన్నికలకు ముందు కూడా ఇదే రకమైన ప్రచారం జరిగిందని, కాని బీజేపీ తిరుగులేని మెజారిటీతో అధికారాన్ని సంతరించుకుందని అన్నారు. కర్నాటక సమగ్రాభివృద్ధికి కూడా పరిపూర్ణ మెజారిటీ కలిగిన ప్రభుత్వ ఏర్పాటు ఎంతైనా అవసరమని తెలిపారు. దాదాపు 30 సంవత్సరాల తర్వాత కేంద్రంలో పూర్తి మెజారిటీ కలిగిన ప్రభుత్వం ఏర్పడింది కాబట్టే భారత ఖ్యాతి అన్ని విధాలుగానూ అంతర్జాతీయంగా వెలిగిపోతోందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గద్దె దించడం ద్వారా బీజేపీని పూర్తి మెజారిటీతో అధికారంలోకి తెచ్చే దిశగా పార్టీ శ్రేణులు అంకిత భావంతో పనిచేయాలన్నారు. బీజేపీకి పూర్తి మెజారిటీ రాదని, అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని ఇలా ఒకదాని తర్వాత ఒకటిగా కుట్రపూరితమైన రీతిలో ప్రచారాలు జరుగుతున్నాయని తెలిపారు. జేడీ(ఎస్) సీనియర్ నేత దేవెగౌడ ఎన్నికల తర్వాత కింగ్ మేకర్‌గా మారతారన్న వాదనను కూడా ఆయన కొట్టిపారేశారు. రాష్ట్భ్రావృద్ధికి కేంద్రం ఇప్పటివరకూ అందించిన సహాయ సహకార వివరాలను వెల్లడించిన మోదీ, ‘సిద్ధరామయ్య ప్రభుత్వం అభివృద్ధి కంటకంగా మారింది. తప్పుడు ప్రచారం తోనే కాలం గడుపుతోంది. దీన్ని గట్టిగా తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది’ అని తెలిపారు. రాష్ట్రంలోని పార్టీ కార్యకర్తలను తప్పుదోవ పట్టించేందుకు బూటకపు ప్రచారంతోపాటు విదేశీ ఏజెన్సీలను కూడా రంగంలోకి దించే అవకాశం ఉందని, అయినప్పటికీ కూడా బీజేపీ శ్రేణులు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ ఆత్మ విశ్వాసాన్ని విడనాడకూడదని అన్నారు. ఈ సందర్భంగా కేంబ్రిడ్జ్ అనలిటికా వివాదం ప్రస్తావించారు. ఈ సంస్థకు చెందిన వివాలను అడ్డం పెట్టుకుని దేశంలో ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్నారు. వరుస పరాజయాలతో నిరాశా నిస్పృహలకు లోనైనా కాంగ్రెస్ అబద్ధాల ప్రచారంతోనే అందలం ఎక్కాలని చూస్తోందన్నారు.