జాతీయ వార్తలు

‘హౌడీ-మోడీ’ని మించిపోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హూస్టన్: భారత్-అమెరికా మధ్య బలమైన మైత్రీ బంధాన్ని పెంపొందించడంలో ‘హౌడీ-మోడీ’ తరహాలోనే ‘నమస్తే ట్రంప్’ కూడా విజయవంతం కాగలదన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. గత ఏడాది సెప్టెంబర్‌లో హౌడీ మోడీ కార్యక్రమాన్ని నిర్వహించిన బృందం ట్రంప్ భార త్ పర్యటన సందర్భంగా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమం కూడా విజయవంతం కావాలని స్పష్టం చేసింది. ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి గుజరాత్‌లోని మోతెరా క్రికెట్ స్టేడియంలో జరిగే ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడతారు. హూస్టన్ గత సెప్టెంబర్‌లో జరిగిన ఇండో-అమెరికన్ల కార్యక్రమంలో మోదీ- ట్రంప్ మాట్లాడిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో లక్షలాది మంది సమక్షంలో అత్యంత ఘనంగా ప్రతిష్టాత్మకంగా నమస్తే ట్రంప్ ను నిర్వహించనున్నారు. దాదాపు లక్ష మందికి పైగా హాజరయ్యేందుకు ఈ స్టేడియాన్ని ముస్తాబు చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని హౌడీ- మోడీ తరహాలో విజయవంతం చేసేందుకు నిర్వాహకులు గట్టిగా కృషి చేస్తున్నారు. వీరి ప్రయత్నాలు ఫలించి భారత్-అమెరికా మధ్య మరింత బలమైన బంధం ఏర్పడగలదన్న ధీమా సర్వత్రా వ్యక్తమవుతోంది. అమెరికాలో జరిగిన ఆ కార్యక్రమానికి 50వేల మంది హాజరయ్యారు. ఇప్పుడు ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమానికి లక్ష మందికి పైగా హాజరు కాగలరని అంచనా. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక, వ్యూహాత్మక మైత్రీ బంధానికి ట్రంప్ పర్యటన దోహదం చేయగలదన్న ధీమా సర్వత్రా వ్యక్తమవుతోంది. అలాగే ఇరు దేశాల మధ్య వాణిజ్యపరంగా కూడా సత్సంబంధాలు నెలకొనడానికి పరస్పర ప్రయోజనాల పరిరక్షణలో మరింత సమన్వయంతో పనిచేయడానికి ఈ పర్యటన దోహదం చేయగలదని చెబుతున్నారు. ముఖ్యంగా ఇండో- పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రాబల్యాన్ని తగ్గించడానికి భారత్- అమెరికా స్నేహబంధం ఎంతగానో దోహదం చేసే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
*చిత్రం... అహ్మదాబాద్‌లో జరిగే ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమానికి ముస్తాబైన సర్దార్ పటేల్ స్టేడియం