జాతీయ వార్తలు

ఢిల్లీలో ఘర్షణలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరం ఆదివారం పౌరసత్వ సవరణ చట్టం అనుకూల, వ్యతిరేకుల మధ్య తీవ్ర స్థాయిలో జరిగిన ఘర్షణలతో అట్టుడుకింది. ఈశాన్య ఢిల్లీలోని జప్రాబాద్‌లో ఈ ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఇరువర్గాలను చెదరగొట్టేందుకు బాష్పవాయువు గోళాలను ప్రయోగించారు. అలాగే ఓ మెట్రో స్టేషన్ గేట్లను కూడా మూసి వేశారు. శనివారం సాయంత్రం నుంచి ఆందోళనకారులు ముఖ్యంగా మహిళలు మెట్రో స్టేషన్‌ను దిగ్బందం చేశారు. పౌరసత్వ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. అదే ప్రాంతంలో బీజేపీ నాయకుడు కపిల్ మిశ్రా కూడా ఓ సభకు పిలుపునిచ్చారు. ఆందోళనకారులను వెంటనే తొలగించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. దీంతో ఆదివారం రెండు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. హింసాకాండ చెలరేగడంతో పోలీసులు బాష్పవాయువు గోళాలు ప్రయోగించారు. అయితే రాత్రి పొద్దుపోయిన తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చిందని పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. ఆందోళనకారులను రెచ్చగొట్టేందుకు మిశ్రా ప్రయత్నించినప్పటికీ ఆయనపై పోలీసులు ఎలాంటి చర్య తీసుకోలేదని మహ్మద్ సాదిక్ అనే విద్యార్థి ఆరోపించారు.
*చిత్రం...ఢిల్లీలో సీఏఏ అనుకూల వ్యతిరేకుల మధ్య ఘర్షణలు