జాతీయ వార్తలు

జీవన వేదం.. జీవ వైవిధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: జీవవైవిద్యం యావత్ మానవాళికి ఓ అద్భుతమైన సంపద అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇంతటి విశిష్టత కలిగిన జీవ వైవిద్య సంపదను రక్షించుకోవాలని, అలాగే పరిరక్షించుకోవాలని ఆదివారం జాతినుద్దేశించి చేసిన మన్‌కీ బాత్ కార్యక్రమంలో మోదీ స్పష్టం చేశారు. ‘మనకు తెలిసింది పిడికెడు, తెలియంది విశ్వమంతా’ అంటూ తమిళ కవియిత్రి అవ్వయ్యార్‌ను ఉటంకించిన మోదీ జీవ వైవిద్య ప్రాధాన్యతను దాని పరిరక్షించిన అవశ్యకతను ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. దీని గురించి ఎంతగా తెలిస్తే మనకు ఇంకా ఎంత తెలియాల్సి ఉందో ప్రతి ఒక్కరికీ స్పష్టమవుతుందని తెలిపారు. మొత్తం మానవాళి మనుగడకే కీలకమైన ఈ జీవ వైవిద్య సంపదను ఎప్పటికప్పుడు పెంపొందించుకోవాలని స్పష్టం చేశారు. భారతీయ సంప్రదాయం, సంస్కృతి వారసత్వ అంశాలు ప్రతి జీవి పట్ల కారుణ్యాన్ని కలిగిస్తాయని, అదేవిధంగా ప్రకృతిని ఆరాధించే, ప్రేమించే సుగుణం కూడా భారతీయతలోనే ఉందని మోదీ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా భారత్‌కు ఎన్నో రకాల పక్షి జాతులు వస్తాయని, ఆ విధంగా ఏడాది అంతా కూడా ఈ రకమైన అరుదైన పక్షి జాతులకు భారత్ ఆవాసమవుతోందని మోదీ అన్నారు. తాజా లెక్కలను బట్టి 500లకు పైగా వివిధ రకాల పక్షి జాతులు భారత్‌కు వస్తాయన్న విషయం స్పష్టమవుతోందన్నారు. మేఘాలయ సొరంగాల్లోనే నివసించే ఓ అరుదైన చేప జాతిని జీవ శాస్తవ్రేత్తలు ఇటీవల కనుగొన్న విషయాన్ని తన మన్‌కీ బాత్‌లో మోదీ వెల్లడించారు. అంతేకాదు ఈ సొరంగాల ఉపరితలంపై ఉన్న ఈ చేప జాతి మిగతా చేప జాతులన్నింటికన్నా కూడా అత్యంత పెద్దదన్న విషయాన్ని మోదీ గుర్తు చేశారు. ఇంత అరుదైన చేప జాతి భారత్‌లో ఉండడం ఎంతో గర్వకారణమని, ఇందుకు మేఘాలయ కేంద్రం కావడం మరింత ఆనందాన్ని కలిగిస్తోందన్నారు. ఇది కూడా భారత దేశ జీవ వైవిద్య సంపదకు మరింత విలువనిచ్చేదని తెలిపారు. ఈ రకమైన తెలియని ఎన్నో మిస్టరీలు మన చుట్టూనే ఉన్నాయని, వాటిని శోధించి వెలికి తీయాల్సి ఉందని తెలిపారు. ఈ రకమైన అరుదైన జాతులను ఇప్పటి వరకు వెలుగు చూడని సంపదను కనుగొనాలంటే అందుకు ప్రగాఢమైన పరిశోధనా జిజ్ఞాస అవసరమని మోదీ తెలిపారు. ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో నిర్వహిస్తున్న హునార్ హాట్‌ను కూడా ఈ సందర్భంగా మోదీ ప్రస్తావించారు. భారత్‌కు సంబంధించిన అరుదైన కళా సంపదకు ఇది అద్దం పడుతోందన్నారు. ఈ రకమైన కేంద్రాలు భారత దేశ వైవిద్య విస్తృతి, సంస్కృతి, సంప్రదాయానికి అద్దం పడతాయని, అలాగే ఎన్నో రకాల భిన్నమైన వంటలకు ఇవి నిలయంగా నిలుస్తాయని అన్నారు. కేవలం చేతి వృత్తులకు సంబంధించిన కళాత్మకతో పాటు అద్భుతమైన భారతీయ వంటకాలకు వాటి రుచికి కూడా హునార్ హాట్‌లు నిలువెత్తు నిదర్శనాలన్నారు. ఈ రకమైన కేంద్రాలను ప్రతి ఒక్కరూ సందర్శించాలని, ఆ విధంగా భారత్ కళా, సాంస్కృతిక వైవిద్యంలో భాగం కావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. చేతి వృత్తి కార్మికులను, ముఖ్యంగా మహిళలను ప్రోత్సహించి వారి పురోగతికి చేయూతనివ్వాలన్నారు.

*చిత్రం... ప్రధాని నరేంద్ర మోదీ