జాతీయ వార్తలు

ఐసెన్‌హోవర్‌తో మొదలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: అమెరికా అధ్యక్షుడి హోదాలో డొనాల్డ్ ట్రంప్ తొలిసారి భారత్‌లో పర్యటించనున్న తరుణంలో ఈ అంశంపై ప్రచారం పతాకస్థాయికి చేరింది. అయితే గత ఆరు దశాబ్దాలకు పైగా కాలంలో భారత్‌లో పర్యటించిన ఏడో అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ నిలవనున్నారు. ఇప్పటి వరకు ఆరుగురు అమెరికా అధ్యక్షులు భారత్‌లో అధికారికంగా పర్యటించారు. అమెరికా అధ్యక్షులు భారత్‌లో పర్యటించడం సుమారు 60 ఏళ్ల క్రితం మొదలయింది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను ప్రేరేపించడానికి తొలిసారి అప్పటి అమెరికా అధ్యక్షుడు డీవైట్ డీ ఐసెన్‌హోవర్ 1959 డిసెంబర్‌లో భారత్‌కు వచ్చారు. అప్పటి నుంచి ఎన్నో ఒడిదుడుకులకు లోనయిన ద్వైపాక్షిక సంబంధాలు చివరకు కొన్ని దశాబ్దాల క్రితం ఒక వ్యూహాత్మక భాగస్వామ్యంగా స్థిరపడ్డాయి. అమెరికా అధ్యక్షుడి హోదాలో ఐసెన్‌హోవర్ 1959 డిసెంబర్ 9-14 తేదీల మధ్య సాగించిన భారత పర్యటన ఇరు దేశాల మధ్య ఒక ప్రధాన ఘట్టంగా నిలిచిపోయింది. దేశ రాజధాని ఢిల్లీ గడ్డపై అడుగుపెట్టిన ఐసెన్‌హోవర్‌కు భారత్ 21-గన్ సెల్యూట్‌తో స్వాగతం పలికింది. ఐసెన్‌హోవర్ తన పర్యటనలో అప్పటి భారత రాష్టప్రతి రాజేంద్ర ప్రసాద్, ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూలతో భేటీ అయ్యారు. ఆయన తన పర్యటనలో ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. నెహ్రూతో కలిసి ఆయన ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను కూడా సందర్శించారు. అమెరికా అధ్యక్షుడి హోదాలో రిచర్డ్ నిక్సన్ 1969 జూలై 31- ఆగస్టు ఒకటి మధ్య భారత్‌లో పర్యటించారు. జిమ్మి కార్టర్ అమెరికా అధ్యక్షుడి హోదాలో 1978 జనవరి 1-3 తేదీల మధ్య భారత్‌లో పర్యటించారు. జనతా పార్టీకి చెందిన నేత మొరార్జీ దేశాయ్ భారత ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొన్ని నెలల తరువాత కార్టర్ ఇక్కడికి వచ్చారు. కార్టర్ తన మూడు రోజుల పర్యటనలో పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించారు. ఢిల్లీకి సమీపంలోని ఒక గ్రామాన్ని ఆయన సందర్శించారు. తరువాత కాలంలో ఆ గ్రామానికి ఆయన పేరు పెట్టారు. తరువాత బిల్ క్లింటన్ అమెరికా అధ్యక్షుడి హోదాలో 2000 మార్చి 19-25 తేదీల మధ్య భారత్‌లో పర్యటించారు. క్లింటన్ పర్యటనతో సుమారు రెండు దశాబ్దాల తరువాత భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతమయ్యాయని అనేక మంది భావిస్తున్నారు. అప్పట్లో భారత ప్రధానిగా అటల్ బిహారి వాజపేయి ఉన్నారు. క్లింటన్ తన పర్యటనలో ఢిల్లీతో పాటు ఆగ్రా, జైపూర్, హైదరాబాద్, ముంబయి వంటి ప్రాచు ర్యం పొందిన పర్యాటక ప్రదేశాలను సందర్శించారు. భారత్, అమెరికా వ్యూహాత్మక, ఆర్థిక భాగస్వామ్యానికి క్లింటన్ పర్యటన పునాది వేసిందని చెప్పవచ్చు. క్లింటన్ కూడా భారత పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించారు. జార్జ్ డబ్ల్యూ బుష్ అమెరికా అధ్యక్షుడి హోదాలో తన సతీమణి లౌరా బుష్‌తో కలిసి 2006 మార్చి 1-3 తేదీల మధ్య భారత్‌లో పర్యటించారు. మన్మోహన్ సింగ్ తొలి దఫా భారత ప్రధానిగా పనిచేసిన కాలంలో ఈ పర్యటన సాగింది.
ఇరు దేశాల మధ్య అణు ఒప్పందం కొలిక్కి రావడానికి ఈ పర్యటన దోహదపడింది. బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడి హోదాలో 2010 నవంబర్ 6-9 తేదీల మధ్య భారత్‌లో పర్యటించారు. భారత్- అమెరికా వ్యూహాత్మక సంబంధాలు బలోపేతం కావడానికి ఒబామా పర్యటన దోహదపడింది.

*చిత్రం... అహ్మదాబాద్‌లో బీఎస్‌ఎఫ్ జవానుల కవాతు