జాతీయ వార్తలు

ప్రగతిశీలత మన న్యాయ లక్షణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక రీతిలో లింగపరమైన న్యాయాన్ని తేవడంలో మన న్యాయ వ్యవస్థ విశేషంగా కృషి చేసిందని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ప్రశంసించారు. న్యాయ వ్యవస్థ, మారుతున్న ప్రపంచం అనే అంశంపై ఆదివారం జరిగిన సమావేశంలో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ప్రసంగిస్తూ సుప్రీం కోర్టు ఎల్లప్పుడూ క్రియాశీల, ప్రగతి శీలంగా నిలిచిందని ఆయన తెలిపారు. సుప్రీం కోర్టు ప్రగతి శీల సామాజిక పరివర్తనకు దారి తీసిందని అన్నారు. మహిళలపై లైంగిక వేధింపులను నివారించడానికి రెండు దశాబ్దాల పాత విశాఖ మార్గదర్శకాలను సూచిస్తున్నదని ఆయన తెలిపారు. సైన్యంలోని మహిళా అధికారులకు పురుష అధికారులతో సమాన స్థాయి కల్పించాలని, కమాండ్ పదవులకు, ఇతర అధికారుల పదవులకు లింగ న్యాయం యొక్క శాశ్వత కమిషన్‌ను ఏర్పాటు చేయాలన్న ఆదేశం ఒక ఉదాహరణగా చెప్పవచ్చన్నారు. ఇది లింగ న్యాయం యొక్క ప్రతిష్టాత్మకమైన ఉదాహరణగా ఆయన పేర్కొన్నారు. కార్యాలయాల్లో మహిళలు లైంగిక వేధింపులకు గురి కాకుండా రెండు దశాబ్దాల క్రితం జారీ చేసిన మార్గదర్శకాల నుంచి మొదలుకుని తాజాగా సైన్యంలో కమాండ్ వంటి ఉన్నతాధికారుల పదవుల్లో నియామకాల వరకూ లింగ వివక్ష ఉండరాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసిందని ఆయన తెలిపారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రతులు ఇప్పుడు తొమ్మిది వ్యవహారిక భాషల్లోనూ లభ్యం కావడం సంతోషకరమని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ అన్నారు. ముఖ్యమైన తొమ్మిది భాషల్లో తీర్పుల ప్రతులు లభించడం వల్ల సామాన్యులకు ఎంతో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. అంతేకాకుండా భాషా వైవిద్యం ఉండబోదన్నారు. న్యాయం మరింత అందుబాటులోకి వచ్చేందుకు సుప్రీం కోర్టు అనేక సంస్కరణలను చేపట్టినందుకు అభినందిస్తున్నానని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ అన్నారు. పర్యావరణ పరిరక్షణ, సమగ్రాభివృద్ధి విషయంలోనూ న్యాయ వ్యవస్థ పాత్ర కీలకంగా ఉంటుందన్నారు. ఈ విషయంలో ప్రపంచ దేశాలు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నాయని ఆయన తెలిపారు.
ఒకే న్యాయ వ్యవస్థ కావాలి: బాబ్డె
పర్యావరణపరమైన అంశాలకు జాతీయ, అంతర్జాతీయ సరిహద్దులు అనేవి ఉండవు కాబట్టి వీటిపై ఒకే రకమైన న్యాయ వ్యవస్థ ఉండాల్సిన అవసరం ఉందని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బాబ్డె అన్నారు. అంతర్జాతీయ న్యాయమూర్తుల సదస్సు ముగింపు సందర్భంగా సోమవారం నాడిక్కడ మాట్లాడిన ఆయన న్యాయ వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్ళను కూడా ప్రస్తావించారు. పర్యావరణ పరిరక్షణ అంశాలపై జాతీయ, అంతర్జాతీయ సరిహద్దు అవరోధాలు ఏవీ ఉండవని నీరు, గాలి ప్రపంచం అంతా వ్యాపించి ఉంటుందని తెలిపారు. అయితే మానవాళి తీసుకుంటున్న చర్యల వల్ల పర్యావరణానికి అలాగే ఈ భూతలంపై నివసించే అనేక జీవ జాతులకు ముప్పు వాటిల్లుతోందన్నారు. అందుకే అనేక రకాల చట్టాలతో నిమిత్తం లేకుండా ఒకే రకమైన చట్టాలతో కూడిన వ్యవస్థను పర్యావరణ పరిరక్షణ నిమిత్తం అందుబాటులోకి తీసుకుని రావాలన్నారు.
ప్రకృతిని కభలిస్తున్నది మానవుడేనని, దాని పరిరక్షణకు తీసుకునే చర్యల కంటే కూడా ప్రకృతిని స్వార్థం కోసం వినియోగించుకోవడమే ఎక్కువగా ఉందన్నారు.

*చిత్రం... రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్