జాతీయ వార్తలు

బంధానికి బలిమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెండు అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాల మహా నేతల కలయిక ఓ మహోత్సవమే అయింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలి భారత పర్యటన రెండు దేశాల మధ్య కొత్త
ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని కలిగించింది. గుజరాత్‌లోని మొతెరా స్టేడియంలో లక్షలాది మంది సమక్షంలో ట్రంప్, మోదీ చేసిన ప్రసంగాలు రెండు దేశాల బంధానికి
అద్దం పట్టాయి. ఇరు దేశాల మధ్య ప్రభుత్వాలపరంగానే కాకుండా ప్రజలపరంగా
కూడా ఉన్న సాన్నిహిత్యానికి నిదర్శనంగా నిలిచాయి.
ట్రంప్ పర్యటన ఓ నవశకం అని మోదీ అంటే, భారత్‌కు
విధేయమైన స్నేహితులం అంటూ ట్రంప్ ప్రకటించారు.
రెండు దేశాల మధ్య ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా విస్తృత సహకారానికి ట్రంప్ పర్యటనతో బలమైన పునాదులు పడ్డాయి.

*చిత్రాలు.. సర్దార్ పటేల్ స్టేడియంలో జరిగిన సభలో అగ్ర దేశ అధినేతతో ప్రధాని మోదీ ఆలింగనం
* అశేష జన వాహిని